NTV Telugu Site icon

Kishan Reddy: మోడీ ప్రభుత్వంలో దేశంలో అభివృద్ధి పరంగా అనేక మార్పులొచ్చాయి..

Kishanreddy

Kishanreddy

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధికారంతో, ఎన్నికలతో సంబంధం లేకుండా పార్టీ సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు. సిద్ధాంతపరంగా, కార్యకర్తల ఆధారంగా, ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ బీజేపీ అని అన్నారు. నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత నరేంద్ర మోడీదని కొనియాడారు. మోడీ ప్రభుత్వంలో దేశంలో అభివృద్ధి పరంగా అనేక మార్పులొచ్చాయని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులు బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు, అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని దుయ్యబట్టారు.

Ram Charan : రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఎప్పటినుండంటే..?

అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడించాలని కుట్ర చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కిషన్ రెడ్డి తెలిపారు. జమ్మూ కశ్మీర్లో దేశ వ్యతిరేక శక్తులను పెంచిపోషించేందుకు వీలుగా ఉన్న ఆర్టికల్ 370ని తొలగించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసి, బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు హక్కులు కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదని ప్రశంసించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు కూడా సాధించలేదు.. కానీ, రాహుల్ ప్రధానమంత్రి అయినట్లు ఊహాగానాల్లో తేలిపోయారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల్లో మొదటిసారిగా చూస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన అసహనంతో పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అబద్ధాలు, తప్పుడు ఆరోపణలతో విషం చిమ్మారని వ్యాఖ్యానించారు. దేశాన్ని చీల్చడం, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించడమే కాంగ్రెస్ ఉద్దేశమని మండిపడ్డారు.

Anagani Satya Prasad: త్వరలోనే గుజరాత్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్..

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి దిగలేదు.. కానీ, బిజెపిపై మెజారిటీ సాధించిందని కిషన్ రెడ్డి తెలిపారు. అందుకు కారణం మజ్లిస్ పార్టీతో కుమ్మక్కవ్వడమేనని ఆరోపించారు. మతోన్మాద శక్తులు ఏకమై బీజేపీని ఓడించే ప్రయత్నం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేది కాంగ్రెస్ పార్టీ.. కాని, బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసింది మజ్లిస్ పార్టీ అని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉగ్రవాదం, కుటుంబ పాలన, అవినీతి పెరిగిపోతుందని దేశ ప్రజలు గ్రహించారన్నారు.
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అణచివేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్లో బాంబుపేలుళ్లతో ప్రజలు వణికిపోయారని తెలిపారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం మరోసారి బయటపడుతుందని చెప్పారు. లోక్ సభ జరగకుండా అడ్డుపడటం.. రాజ్యాంగం గురించి అబద్ధాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరించేందుకు సిద్ధమైంది.. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కిషన్ రెడ్డి కోరారు.