Kishan Reddy: రెండు నెలలుగా స్టాలిన్ వితండవాదం చేస్తున్నాడు..
- తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
- గత రెండు నెలలుగా వితండవాదం చేస్తున్నాడు- కిషన్ రెడ్డి
- స్టాలిన్ వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయపరమైన విమర్శ- కిషన్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత రెండు నెలలుగా తమిళనాడు ముఖ్యమంత్రి వితండ వాదం చేస్తున్నాడని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో మాకు అన్యాయం చేయడానికి మోదీ కుట్ర పన్నాడు అని మాట్లాడుతున్నారు.. అది పూర్తిగా రాజకీయపరమైన విమర్శ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, డీఎంకే దివాలు కోరు రాజకీయం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో స్టాలిన్ ప్రభుత్వం ఓడిపోతుంది.. తమిళనాడు ప్రజలు స్టాలిన్ కుటుంబానికి వ్యతిరేకంగా మారారని అన్నారు. దానిని కప్పి పుచ్చుకోవడానికి కొత్తగా తెర మీదికి తీసుకొస్తున్నారని వెల్లడించారు. తమిళనాడులో సంక్షేమ పథకాలను అందించే విషయంలో విఫలం అయ్యారు.. వీటి నుండి తప్పించి కోవడానికి మోదినీ భూచీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తమిళనాడులో జరిగిన లిక్కర్ కుంభకోణంలో డీఎంకే పాత్ర ఉంది.. దీనిని డైవర్ట్ చెయ్యడానికి కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. 1986లో ఎడ్యుకేషన్ పాలసీ ప్రవేశ పెట్టడం, ఇప్పుడు మోది ప్రవేశపెట్టిన ఎడ్యుకేషన్ విధానం చూస్తే.. హిందీ ఇతర రాష్ట్రాల్లో హిందీకి ప్రాధాన్యత కల్పించడం జరిగిందని చెప్పారు. త్రిభాషా సిద్ధాంతం బ్రిటిష్ కాలంలోనే ఉంది.. కొత్తగా మోది ఏమి ప్రవేశ పెట్టలేదని తెలిపారు. గతంలో విద్యారంగం పై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొఠారి కమిషన్ ఈ త్రిభాషా సిద్ధాంతాన్ని బలపరిచింది.. ఈ విషయం డీఎంకేకు కూడా తెలుసని అన్నారు. మాతృ భాషలను ప్రోత్సహించాలని నిర్ణయించింది మోది ప్రభుత్వమే.. ఎన్నికలు రాగానే కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తుంటారని కేంద్రమంత్రి ఆరోపించారు. ఇప్పుడు డీఎంకే ఎత్తుకున్న ఈ అంశం ఎన్నికల ఎత్తుగడ మాత్రమనని తెలిపారు.
Also Read
Read Also: Top Headlines @1PM: టాప్ న్యూస్!
తమిళుడు రూపొందించిన రూపాయిని కూడా డీఎంకే మార్చేసింది.. ఇది చూస్తే డీఎంకే ఎంత దిగజారింది అనేది అర్థం అవుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఇది పూర్తిగా స్టాలిన్ ప్రభుత్వంపై, కుటుంబంపై ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని అవసరం కాంగ్రెస్ పార్టీపై ఉంది.. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రవేశ పెట్టారు.. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని కోరారు. ఎందుకంటే అప్పుడు డీఎంకే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉంది కాబట్టే వ్యతిరేకించలేదన్నారు. మరోవైపు.. ఎవరికి కావాల్సిన భాషలో వారు చదువుకోవచ్చు.. ఆ స్వేచ్ఛ మోది తెచ్చిన విద్యా విధానంలో ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. అంతే కానీ ఖచ్చితగా ఇదే భాషలో చదవాలని ఎక్కడా కూడా లేదన్నారు. త్రిభాషా సిద్ధాంతం పై కాంగ్రెస్ వైఖరి ఏంటో రాహుల్ గాంధీ చెప్పాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ దేశంలో హిందీ భాషా ఉండకూడదా.. రాహుల్ చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత పదేళ్ళుగా తమిళ భాషను ప్రస్తావించడానికి మోది అనేక చర్యలు తీసుకున్నారన్నారు. తమిళ భాష కోసం ఏం ఎలాగబెట్టారో స్టాలిన్ చెప్పాలని పేర్కొన్నారు..
లోక్ సభ సీట్లు తగ్గుతాయని బీఆర్ఎస్ పదే పదే అంటుంది.. డీలిమిటేషన్ యాక్ట్ ఆధారంగా మన రాష్ట్రంతో పాటు దేశం మొత్తం డీలిమిటన్ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు వరకు ఆ యాక్ట్‌లో ఒక్క మార్పు జరగలేదని చెప్పారు. అది మొదటగా సైన్సెస్ అవ్వాలి.. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. డీలిమిటేషన్ కమిటి 2002లో ఏర్పాటు చేస్తే నాలుగు ఐదు సంవత్సరాలు అభిప్రాయ సేకరణ చేసిందని పేర్కొన్నారు. ఇంత పని గతంలో ఉన్న కమిటి చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ABCD లేదు.. దున్నపోతు ఈనిందంటే దూడను వేరు చేసినట్లు ఉంది కాంగ్రెస్, డీఎంకేల పని అని కిషన్ రెడ్డి విమర్శించారు. సౌత్‌లో బీజేపీకి బలం లేదు అంటున్నారు.. మీరు అన్ని పార్టీలు మీటింగులు పెట్టుకోండి.. చర్చించి మీ సలహాలు ఇవ్వండి..
అంతే కానీ.. అబద్ధాలు ప్రచారం చేయకండని కిషన్ రెడ్డి సూచించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!