NTV Telugu Site icon

Kishan Reddy: జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి ఆగ్రహం

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల ముందు నిర్ణయించిన దిశా మీటింగ్‌కు అధికారులు హాజరు కాకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ సమావేశం ఉందని తెలిసి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఎలా పెట్టుకుంటారని అధికారులను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ ఒప్పుకున్నా.. జీహెచ్ఎంసీ సహకరించడం లేదని కిషన్ రెడ్డి దృష్టికి రైల్వే అధికారులు తెచ్చారు.

Read Also: Muralidhar Rao: తెలంగాణలో యువతే గేమ్ చేంజర్లు.. వాళ్ళు మా వైపు వస్తే అతడ్ని ఓడిస్తాం..

రెండు రోజుల ముందు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టుకుని దిశా సమావేశానికి ఎలా డుమ్మా కొడతారు? అంటూ గైర్హాజరు అయిన అధికారులపై కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. జీహెచ్ఎంసీ సహకారం లేని కారణంగా పనులు పెండింగ్‌లో పడుతున్నాయన్నారు. దిశా సమావేశం పెట్టుకుంటే కనీసం సమావేశంలో సమాధానం చెప్పేవారు కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నా అందుకు తగిన సహకారం ఉండటం లేదనే ప్రాజెక్ట్స్ పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ కలెక్టర్‌కు జీహెచ్ఎంసీ, రైల్వే సిబ్బందిని కోఆర్డినేట్ చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

 

Show comments