NTV Telugu Site icon

Kishan Reddy: కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ.. భారత్ జోడో యాత్రకు ధీరజ్ సాహు ఆర్థిక సాయం..!

Kishanreddy

Kishanreddy

భారత దేశ చరిత్రలో అత్యంత కీలక నిర్ణయం జమ్మూ కాశ్మీర్ లో తీసుకున్నారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆర్టికల్ 370 రద్దును అన్ని వర్గాల ప్రజలు స్వాగతం పలికారు.. విపక్షాలు వ్యతిరేకించిన, జమ్మూ ప్రజలు సమన్వయంతో వ్యవహరించారు.. జమ్మూలో ఎన్నో మార్పులు వచ్చాయి.. సుప్రీం కోర్టు ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాము.. జమ్మూను సామాజికంగా ఆర్థిక పరంగా మౌలిక వసతులు కల్పించాలని ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు అని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితుడు.. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన వ్యాపారాలపైన.. ఆదాయపు పన్నుశాఖ అధికారులు చేసిన దాడుల్లో నేటి వరకు రూ.351 కోట్లు బయటపడ్డాయి.. దేశ చరిత్రలోనే ఓ సంచలనం అని కిషన్ రెడ్డి అన్నారు.

Read Also: Bussiness Idea : బెల్లం పొడితో వ్యాపారం.. లాభాలు లక్షల్లో..!

ఇంత పెద్ద ఎత్తున అక్రమ డబ్బు పట్టుబడిన సందర్భాల్లో ఇదే ఎక్కువ అని కిషన్ రెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో.. సోషల్ మీడియాలో ధీరజ్ సాహు పోస్టు చేస్తూ.. ‘కొందరు ఇంత పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని ఎందుకు దాచుకుంటారో అర్థం కావడం లేదు’ అని ట్వీట్ చేశారు.. బ్యాంకు లాకర్లు, ఇతర వ్యాపార కేంద్రాల మీద దర్యాప్తును ఐటీతో పాటుగా వివిధ దర్యాప్తు సంస్థలు కొనసాగిస్తున్నాయి.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆర్థికంగా సహాయం అందించిన వ్యక్తి ధీరజ్ సాహు అని ఆయన ఆరోపించారు. రాహుల్ కను సైగల్లో.. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం ఈ డబ్బు పోగు చేస్తున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆదాయపు పన్ను అధికారులను అభినందిస్తున్నాను.. నల్లధనంపై జరుగుతున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను.. ప్రధాని ఆకాంక్షలను పూర్తి చేసే దిశగా ఇలాగే సంపూర్ణ సహకారం అందించాలని కోరుతున్నాను అని కిషన్ రెడ్డి తెలిపారు.

Read Also: YSRCP Gajuwaka: వైసీపీకి గాజువాక ఇంఛార్జ్ గుడ్‌బై.. మంత్రి అమర్‌నాథ్‌కు బాధ్యతలు!

కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాలేదు అని కిషన్ రెడ్డి తెలిపారు. కానీ, 5 ఏండ్లకు సరిపడా వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది.. ఛత్తీస్ గఢ్ లోన అవినీతి ఎక్కువైనందునే ఆ పార్టీని ఓడించారు.. గత తొమ్మిదిన్నర ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక చిన్న అవినీతి మరకకూడా లేకుండా పని చేస్తోంది.. కర్ణాటక బిల్డర్లను బెదిరించి, కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి తెలంగాణ ఎన్నికల్లో వినియోగించారు అని ఆయన ఆరోపించారు. శబరిమలలో పూర్తి స్థాయిలో భక్తులు ఇంకా చేరుకోక ముందే.. పరిస్థితులు, ఏర్పాట్లు అధ్వాన్నంగా ఉన్నాయి.. ఇవాళ కేరళ సీఎంతో మాట్లాడబోతున్నాను.. కేరళ ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు.. యుద్ధ ప్రాతిపదికన భ్రదతా సిబ్బంది, మౌలిక వసతులు, కనీస ఏర్పాట్లు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరపున ప్రసాద్ పథకం ద్వారా.. మౌలిక వసతులు కల్పిస్తామంటే.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు.. సీపీఎం ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Jagtial: వెల్గటూర్ ఎంపీపీ కూనమల్ల లక్ష్మిపై అవిశ్వాసం

అయ్యప్ప స్వామి భక్తులకు మౌలికవసతులు కల్పించడం, తొక్కిసలాటలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేరళ సీఎంను కోరుతున్నాను అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయంలో తమవంతు పాత్రను పోషించాలి.. భక్తులు కూడా సంయమనంతో ఉండాలి.. ఎవరూ భయపడొద్దు, కేరళ ప్రభుత్వం ఏ సహాయం కోరినా.. అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది అని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో నేను పవన్ కల్యాణ్‌ను ఏదో అన్నట్లు దుష్ప్రచారం జరుగుతుంది.. దీన్ని నేను ఖండిస్తున్నాను.. అలాంటి మాటలే జరగలేదు.. ఎవరో ఏదో రాసి పెడితే ఎలా?, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.. నియమాలకు విరుద్ధంగా, సీనియారిటీని కాదని, తమ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ.. మజ్లిస్ కు చెందిన వ్యక్తిని ప్రొటెం స్పీకర్ గా నియమించడం.. శాసనసభ నిబంధనల ఉల్లంఘన.. అందుకే మేం ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాం.. రెగ్యులర్ స్పీకర్ వచ్చాకే ప్రమాణస్వీకారం చేస్తాం.. తెలంగాణలో 100 శాతం ఓటింగ్ పెరిగిన ఏకైక పార్టీ బీజేపీయే అని కిషన్ రెడ్డి వెల్లడించారు.