మంచి వ్యాపారం చెయ్యాలని అనుకుంటున్నారా? ఎటువంటి రిస్క్ లేకుండా అదిరిపోయే బిజినెస్ ఐడియాను మీకోసం తీసుకొచ్చాము.. అదేంటంటే బెల్లం బిజినెస్.. ఆల్రెడీ మార్కెట్ లో చాలా మంది చేస్తున్నారు అనుకుంటున్నారా? అదేనండి బెల్లం పొడితో వ్యాపారం.. తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందవచ్చు.. ఈ బిజినెస్ ను ఎలా మొదలు పెట్టాలి.. ఎంత లాభాలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తుండటంతో ఎక్కువగా బెల్లంను వినియోగించేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది. అందరూ ఆర్గానిక్ బెల్లం పొడిని వాడుతున్నారు. ఆరోగ్య నిపుణులు కూడా అదే సూచిస్తున్నారు. చెరుకు రసం తయారు చేసిన బెల్లం పానకంలో ఎలాంటి రసాయనాలు కలపరు. గడ్డకట్టించి బెల్లంగా దాన్ని మారుస్తారు.. ఇది పొడి రూపంలో మనకు మార్కెట్ లో దొరుకుంది…
దీన్ని మీరు తయారు చేస్తూ అధిక లాభాలను పొందవచ్చు.. ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మీరు ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి.. నిజానికి రైతులే బెల్లం పొడిని తయారు చేస్తారు.. వారి దగ్గర నుంచి క్వింటాల్ లెక్కన కొనుగోలు చెయ్యాలి.. అప్పుడు మీకు తక్కువ రేటుకు వస్తుంది.. దాన్ని కిలో లెక్కన ఫ్యాక్ చేసి బయట మార్కెట్ లో అమ్మవచ్చు.. ఈ బెల్లం పొడి ధర కిలో 50 నుండి 60 రూపాయలు ఉంటుంది.. దీనికి సంబందించిన వీడియోలు కూడా నెట్టింట చాలానే దొరుకుతున్నాయి.. వాటిని చూస్తే ఒక అవగాహనా కూడా వస్తుంది..