Site icon NTV Telugu

కేంద్రమంత్రి అజయ్ మిశ్రాకు చేదుఅనుభవం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాకు భువనేశ్వర్‌లో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌పై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన స్టూడెంట్స్‌ విభాగం నేతలు కోడి గుడ్లతో దాడి చేశారు. ఆయన భువనేశ్వర్‌ నుంచి కటక్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మంత్రి కాన్వాయ్‌ను ముందుకు వెళ్లకుండా విద్యార్థి నాయకులు నల్ల బ్యాడ్జీలను ప్రదర్శించి అడ్డుకున్నారు.

లఖింపుర్‌ఖేరి హింసాత్మక ఘటనలో అజయ్‌ మిశ్రా కొడుకు, ఆశిష్‌ మిశ్రా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆశిష్‌ మిశ్రాపై రైతుల పైకి కారు ఎక్కించి వారి చావుకు కారణమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది. రైతులకు సంబంధించిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెల్సిందే..అయితే లిఖింపుర్‌ ఖేరి ఘటనలో మంత్రి కొడుకు హస్తం ఉందని వారు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రి సమాధానం చెప్పాలన్నారు. అజయ్‌ మిశ్రా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Exit mobile version