Union Budget 2026: రైతుల చేతికి AI ఆయుధం.. వ్యవసాయం కోసం కొత్త పథకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో రైతులకు తీపికబురు అందించారు. ఆదివారం పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఈ బడ్జెట్లో వ్యవసాయం కేవలం పంటల వరకే పరిమితం కాదని, టెక్నాలజీతో కలిపి రైతుల ఆదాయాన్ని పెంచాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఒక కొత్త, ఆసక్తికరమైన పథకాన్ని ప్రకటించారు. దాని పేరు ‘భారత్ విస్తార్’. ఇది కృత్రిమ మేధస్సు(AI) ఆధారంగా పనిచేసే ప్రత్యేక డిజిటల్ సాధనం. ముఖ్యంగా ఇది అనేక భాషల్లో పనిచేయడం దీని ప్రత్యేకత. దేశంలో ఇప్పటికే ఉన్న అగ్రి-స్టాక్ పోర్టల్స్, ఐసీఏఆర్ (వ్యవసాయ పరిశోధనా సంస్థ) ఇచ్చే సాగు సూచనలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ఈ టూల్ రూపొందించనున్నారు. రైతులు తమ భాషలోనే పంటలు, సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికతపై సమాచారం పొందేలా చేయడమే దీని లక్ష్యంగా ఆర్థిక మంత్రి తెలిపారు. అంటే, టెక్నాలజీ నేరుగా రైతు చేతిలోకి వెళ్లేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
READ MORE: SuryaKumar Yadav: సంజూ స్థానంలో ఇషాన్ కిషన్ కీపింగ్.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్!
Also Read
- Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
- Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
- Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గ్రామీణ జీవనోపాధులపై సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒకే పంటపై ఆధారపడకుండా, ప్రాంతానికి తగిన పంటలు పండించేలా ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పారు. దీని వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, గ్రామాల్లో కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని ఆమె వివరించారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి, చందనం, కోకో, జీడిపప్పు వంటి విలువైన పంటలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇవి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉన్న పంటలు కావడంతో రైతులకు ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో అగర్ చెట్ల సాగుకు మద్దతు ఇస్తామని చెప్పారు. అగర్ చెట్లు పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగపడతాయి కాబట్టి అక్కడి రైతులకు కొత్త ఆదాయ మార్గంగా మారనున్నాయి. పర్వత ప్రాంతాల్లో ఉన్న రైతుల కోసం ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. బాదం, వాల్నట్, పైన్ నట్స్ వంటి గింజల సాగును ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇవి ఖరీదైన పంటలు కావడంతో, సరైన మద్దతు లభిస్తే అక్కడి రైతుల జీవన స్థాయి గణనీయంగా మెరుగవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
READ MORE: Ram Charan: ‘ఇంత ఆనందంలో మాటలు రావడం లేదు’.. రామ్ చరణ్ భావోద్వేగం!
తాజావార్తలు
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!