TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాటా మోటార్స్ తన సబ్-ఫోర్-మీటర్ సెడాన్ విభాగంలో టిగోర్ ఫేస్‌లిఫ్ట్ స్థానంలో సరికొత్త ‘ఏరిస్’ (Aeris) కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.29 లక్షలుగా నిర్ణయించారు. డిజైన్ పరంగా ఈ కారు ముందు భాగం సరిగ్గా టియాగో మోడల్‌ను పోలి ఉంటుంది. అయితే బంపర్‌పై తక్కువ బ్లాక్ క్లాడింగ్ ఇవ్వబడింది. ఇంకా ఇందులో బ్లాక్ చేయబడిన ఓఆర్‌విఎంలు, టర్న్ ఇండికేటర్లు, 15-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కనెక్టెడ్ సెటప్‌లా కనిపించే వెనుక టెయిల్-లైట్ గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఈ కారు డండేలి డ్రిజిల్ (లావెండర్), నైట్రో క్రిమ్సన్ (రెడ్), డ్యూన్ గ్లో (సాండ్), డేటోనా గ్రే, ప్యూర్ గ్రే, ప్రిస్టిన్ వైట్ అనే ఆరు ఆకర్షణీయమైన కలర్స్‌లో లభిస్తుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే.. లలిత్పూర్ గ్రే క్యాబిన్ థీమ్ అండ్ డ్యూయల్-టోన్ సీట్లతో దీనిని తీర్చిదిద్దారు. స్టీరింగ్ వీల్, డాష్‌బోర్డ్ లేఅవుట్, సెంటర్ కన్సోల్ అన్నీ సరిగ్గా టియాగో మాదిరిగానే ఉంటాయి. ఇందులో కొత్త టూ-స్పోక్ స్టీరింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సింగిల్ వైర్లెస్ ఛార్జర్, వెనుక ఏసీ వెంట్లు, ఆటోమేటిక్ వేరియంట్ల కోసం రోటరీ డ్రైవ్ సెలెక్టర్, డాష్కామ్తో కూడిన 360 డిగ్రీల కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
Also Read
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
- Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!
- CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
- Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
ఇంజన్ పనితీరు పరంగా టాటా ఏరిస్ 1.2-లీటర్ పెట్రోల్ మోటార్‌తో వస్తుంది. ఇది 85bhp శక్తిని, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే దీనిలో ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో కూడిన ఐ-సిఎన్జి (i-CNG) వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, ఇది 74.5bhp శక్తిని , 96.5Nm టార్క్‌ను ఇస్తుంది. పెట్రోల్ అండక సీఎన్జీ రెండూ కూడా 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తాయి. ఈ కారు బుకింగ్స్ నేటి నుంచే ప్రారంభం కాగా.. అక్టోబర్ 11 నుంచి డెలివరీలు అందించనున్నారు.
తాజావార్తలు
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
-
TV Nandi Awards: తిరుపతి వేదికగా ‘నంది’ అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
-
Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
-
Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
-
Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!