తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల జోష్ ఊపందుకుంది. తొలి విడత పోలింగ్ ఈ నెల 11న జరుగనున్నది. అయితే పలు గ్రామాల్లోని ప్రజలు తమ గ్రామం అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఈ క్రమంలో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీలకు సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీల సర్పంచులు కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read:Rajanna Siricilla: బైకు కు సైడ్ ఇవ్వలేదని.. ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి యత్నం
తనను కలిసిన గ్రామస్తులతో కేసీఆర్ మాట్లాడుతూ.. మనకు అన్ని కాలాలు అనుకూలంగా వుండవు అని అన్నారు. కొన్ని కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి వాటికి వెరవకూడదన్నారు. మల్లా మన ప్రభుత్వమే వస్తుంది. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచిరోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పడిదాకా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడొద్దన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలని సూచించారు. ఇప్పుడు నూతనంగా ఎన్నికైతున్న సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలన్నారు.
Also Read:Sigma : సందీప్ కిషన్ ‘సిగ్మా’లో కేథరీన్ స్పెషల్ సాంగ్
గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని, ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని, మన పని మనం చేసుకుంటూ, మన పల్లె అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఎవరో ఏదో చేస్తారని ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని కేసీఆర్ తెలిపారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో తమ పల్లెలను సామాజిక ఆర్థిక స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చి దిద్దుకోవాలని కేసీఆర్ కోరారు.
