తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల జోష్ ఊపందుకుంది. తొలి విడత పోలింగ్ ఈ నెల 11న జరుగనున్నది. అయితే పలు గ్రామాల్లోని ప్రజలు తమ గ్రామం అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఈ క్రమంలో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీలకు సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీల సర్పంచులు కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…