S Jaishankar: ఆమోదయోగ్యం కాదు.. రష్యన్ సైన్యంలో భారతీయులపై ఎస్ జైశంకర్
- రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో ఎస్ జైశంకర్ భేటీ
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న పౌరులపై భారత్ ఆందోళన
- వారు సురక్షితంగా తిరిగి రావాలని ఒత్తిడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో బుధవారం ఆస్తానాలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న తమ పౌరులపై భారత్ ఆందోళనలను లేవనెత్తారు. వారు సురక్షితంగా తిరిగి రావాలని ఒత్తిడి చేశారు . యుద్ధం నేపథ్యంలో భారతీయుల సమస్యపై లావ్‌రోవ్‌తో లేవనెత్తారా అనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. అనేక మంది భారతీయులు రష్యా సైన్యంలో సేవలందించారని ఆయన తెలిపారు. భారత పౌరులు వేరే దేశానికి చెందిన సైన్యంలో సేవలు అందించడం ఆమోదయోద్యం కాదన్నారు. నివేదికల ప్రకారం, రష్యా సైన్యంలో దాదాపు 200 మంది భారతీయులు భద్రతా సహాయకులుగా నియమించబడ్డారు. యుద్ధ ప్రాంతంలో కనీసం నలుగురు భారతీయులు మరణించారు.
Read Also: Uttarakhand: మైనర్ జంట డేటింగ్‌కు వెళ్లడం నేరం కాదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉత్తరాఖండ్ హైకోర్టు
Also Read
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
ఆస్తానాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ను కలవడం ఆనందంగా ఉందని జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యం, సమకాలీన సమస్యలపై చర్చించామని ఆయన తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ( SCO ) వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి జైశంకర్ మంగళవారం కజకిస్తాన్ రాజధాని ఆస్తానాకు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మాస్కో పర్యటనకు వెళ్లే కొద్ది రోజుల ముందు ఇద్దరు విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరిగింది. విదేశీ వ్యవహారాల మంత్రి కూడా గ్లోబల్ స్ట్రాటజిక్ ల్యాండ్‌స్కేప్ గురించి చర్చించారు. లావ్‌రోవ్‌తో అంచనాలు, అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు.
షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జైశంకర్.. రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బెలారస్, కజకిస్తాన్‌లకు చెందిన నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా, శిఖరాగ్ర సమావేశానికి ఆస్తానాలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, హత్రాస్ దుర్ఘటనపై భారత అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము,ప్రధాని నరేంద్ర మోడీకి సంతాప సందేశం పంపారు.
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!