NTV Telugu Site icon

S Jaishankar: ఆమోదయోగ్యం కాదు.. రష్యన్ సైన్యంలో భారతీయులపై ఎస్ జైశంకర్

S Jaishankar

S Jaishankar

S Jaishankar: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో బుధవారం ఆస్తానాలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న తమ పౌరులపై భారత్ ఆందోళనలను లేవనెత్తారు. వారు సురక్షితంగా తిరిగి రావాలని ఒత్తిడి చేశారు . యుద్ధం నేపథ్యంలో భారతీయుల సమస్యపై లావ్‌రోవ్‌తో లేవనెత్తారా అనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. అనేక మంది భారతీయులు రష్యా సైన్యంలో సేవలందించారని ఆయన తెలిపారు. భారత పౌరులు వేరే దేశానికి చెందిన సైన్యంలో సేవలు అందించడం ఆమోదయోద్యం కాదన్నారు. నివేదికల ప్రకారం, రష్యా సైన్యంలో దాదాపు 200 మంది భారతీయులు భద్రతా సహాయకులుగా నియమించబడ్డారు. యుద్ధ ప్రాంతంలో కనీసం నలుగురు భారతీయులు మరణించారు.

Read Also: Uttarakhand: మైనర్ జంట డేటింగ్‌కు వెళ్లడం నేరం కాదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉత్తరాఖండ్ హైకోర్టు

ఆస్తానాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ను కలవడం ఆనందంగా ఉందని జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యం, సమకాలీన సమస్యలపై చర్చించామని ఆయన తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ( SCO ) వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి జైశంకర్ మంగళవారం కజకిస్తాన్ రాజధాని ఆస్తానాకు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మాస్కో పర్యటనకు వెళ్లే కొద్ది రోజుల ముందు ఇద్దరు విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరిగింది. విదేశీ వ్యవహారాల మంత్రి కూడా గ్లోబల్ స్ట్రాటజిక్ ల్యాండ్‌స్కేప్ గురించి చర్చించారు. లావ్‌రోవ్‌తో అంచనాలు, అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు.

షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జైశంకర్.. రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బెలారస్, కజకిస్తాన్‌లకు చెందిన నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా, శిఖరాగ్ర సమావేశానికి ఆస్తానాలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, హత్రాస్ దుర్ఘటనపై భారత అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము,ప్రధాని నరేంద్ర మోడీకి సంతాప సందేశం పంపారు.