NTV Telugu Site icon

IPhone Lawsuit: డిలీట్ చేసిన మెసేజ్‌లు భార్య చూసిందని.. యాపిల్‌పై దావా వేసిన భర్త

Apple

Apple

IPhone Lawsuit: మీరు భార్యాభర్తల మధ్య విడాకుల కేసులను చూసి ఉంటారు, కానీ ఇంగ్లాండ్‌లో ఒక ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఒక వ్యక్తి తన విడాకులకు బాధ్యత వహిస్తూ స్మార్ట్‌ఫోన్ తయారీదారు, ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజం యాపిల్‌పై 6.3 మిలియన్ డాలర్ల దావా వేశారు. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.53 కోట్లు. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన విడాకుల్లో ఇదే అత్యంత విశిష్టమైన కేసుగా పరిగణించబడుతుంది. తన ఖరీదైన విడాకులకు ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ కారణమని సదరు వ్యక్తి చెబుతున్నాడు. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, వ్యక్తి ఎందుకు ఇలా భావిస్తున్నాడు? దీని వెనుక కారణం ఏమిటి? ఆ వ్యక్తి యాపిల్‌పై ఎందుకు కేసు పెట్టాడు? దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

Read Also: Air India: ప్రయాణికుడి భోజనంలో ‘మెటల్ బ్లేడ్’.. ఎయిరిండియా విమానంలో ఘటన

ఏం జరిగింది?
యూకే పబ్లికేషన్ ది టైమ్స్ ప్రకారం, ఆ వ్యక్తి తన ఇంటి ఐమ్యాక్‌ కంప్యూటర్‌లో సెక్స్ వర్కర్లలో ఒకరితో చాటింగ్ (iMessages) చేస్తున్నట్లు అతని భార్య గుర్తించిందని చెప్పాడు. వాస్తవానికి, అతను తన ఐఫోన్ నుంచి iMessages ద్వారా సెక్స్ వర్కర్‌తో చాట్ చేస్తున్నాడు. చాటింగ్ తర్వాత, అతను తన ఐఫోన్ నుంచి చాట్‌ను తొలగించాడు. కానీ, ఇదే యాపిల్ ఐడీని తన కుటుంబానికి చెందిన ఐమ్యాక్‌లోనూ ఉపయోగించాడు. దీంతో ఫోన్‌లో మెసేజ్‌లు డిలీట్ చేసినప్పటికీ ఐమ్యాక్‌లో అలాగే ఉండిపోయాయి. ఆ మెసేజ్‌లను చూసిన భార్య అతడి నుంటి విడిపోయింది. ఆమె విడాకుల కోసం దాఖలు చేసింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి యాపిల్‌పై దావా వేశాడు.

ఫోన్‌లో మెసేజ్‌లు డిలీట్ చేసినప్పుడు అవి పూర్తిగా తొలగిపోయాయనే అనుకుంటామని.. ఐమెసేజ్‌లను తొలగించినప్పుడు అవి ఇతర పరికరాల నుంచి కూడా తొలగించబడతాయా లేదా అని ఆపిల్ స్పష్టంగా చెప్పి ఉంటే, బహుశా అతని బంధం విడిపోయేది కాదని ఆ వ్యక్తి చెప్పాడు. “ఈ సందేశాలు ఇతర పరికరాల నుండి తొలగించబడవని నాకు తెలిసి ఉంటే, నేను నా భార్యతో మాట్లాడేవాడిని, బహుశా మా విడాకులు జరిగేవి కావు. ఇప్పుడు ఆమె నేరుగా మెసేజ్‌లు చూడడం వల్ల పరిస్థితి తీవ్రంగా మారింది.” అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని యాపిల్ సరిగ్గా చెప్పలేదని.. దీనివల్ల తాను 5 మిలియన్ పౌండ్లు నష్టపోయానని.. ఇందుకు గానూ యాపిల్ తనకు 5 మిలియన్ పౌండ్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.53కోట్లు ) చెల్లించాలని దావా వేశాడు. ఈ పిటిషన్‌పై స్థానిక కోర్టు త్వరలో విచారణ జరపనుంది.