IPhone Lawsuit: డిలీట్ చేసిన మెసేజ్‌లు భార్య చూసిందని.. యాపిల్‌పై దావా వేసిన భర్త
- డిలీట్ చేసిన మెసేజ్‌లు భార్య చూసిందని యాపిల్ కంపెనీపై దావా
- సెక్స్ వర్కర్‌తో చాట్ చేసి మెసేజ్‌లు డిలీట్ చేసిన భర్త
- ఆ మెసేజ్‌లు చూసి విడాకులిచ్చిన భార్య
- యాపిల్ కంపెనీపై దావా వేసిన వ్యక్తి.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPhone Lawsuit: మీరు భార్యాభర్తల మధ్య విడాకుల కేసులను చూసి ఉంటారు, కానీ ఇంగ్లాండ్‌లో ఒక ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఒక వ్యక్తి తన విడాకులకు బాధ్యత వహిస్తూ స్మార్ట్‌ఫోన్ తయారీదారు, ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజం యాపిల్‌పై 6.3 మిలియన్ డాలర్ల దావా వేశారు. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.53 కోట్లు. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన విడాకుల్లో ఇదే అత్యంత విశిష్టమైన కేసుగా పరిగణించబడుతుంది. తన ఖరీదైన విడాకులకు ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ కారణమని సదరు వ్యక్తి చెబుతున్నాడు. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, వ్యక్తి ఎందుకు ఇలా భావిస్తున్నాడు? దీని వెనుక కారణం ఏమిటి? ఆ వ్యక్తి యాపిల్‌పై ఎందుకు కేసు పెట్టాడు? దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
Read Also: Air India: ప్రయాణికుడి భోజనంలో ‘మెటల్ బ్లేడ్’.. ఎయిరిండియా విమానంలో ఘటన
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
ఏం జరిగింది?
యూకే పబ్లికేషన్ ది టైమ్స్ ప్రకారం, ఆ వ్యక్తి తన ఇంటి ఐమ్యాక్ కంప్యూటర్లో సెక్స్ వర్కర్లలో ఒకరితో చాటింగ్ (iMessages) చేస్తున్నట్లు అతని భార్య గుర్తించిందని చెప్పాడు. వాస్తవానికి, అతను తన ఐఫోన్ నుంచి iMessages ద్వారా సెక్స్ వర్కర్‌తో చాట్ చేస్తున్నాడు. చాటింగ్ తర్వాత, అతను తన ఐఫోన్ నుంచి చాట్‌ను తొలగించాడు. కానీ, ఇదే యాపిల్ ఐడీని తన కుటుంబానికి చెందిన ఐమ్యాక్‌లోనూ ఉపయోగించాడు. దీంతో ఫోన్లో మెసేజ్‌లు డిలీట్ చేసినప్పటికీ ఐమ్యాక్‌లో అలాగే ఉండిపోయాయి. ఆ మెసేజ్‌లను చూసిన భార్య అతడి నుంటి విడిపోయింది. ఆమె విడాకుల కోసం దాఖలు చేసింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి యాపిల్‌పై దావా వేశాడు.
ఫోన్లో మెసేజ్‌లు డిలీట్ చేసినప్పుడు అవి పూర్తిగా తొలగిపోయాయనే అనుకుంటామని.. ఐమెసేజ్‌లను తొలగించినప్పుడు అవి ఇతర పరికరాల నుంచి కూడా తొలగించబడతాయా లేదా అని ఆపిల్ స్పష్టంగా చెప్పి ఉంటే, బహుశా అతని బంధం విడిపోయేది కాదని ఆ వ్యక్తి చెప్పాడు. “ఈ సందేశాలు ఇతర పరికరాల నుండి తొలగించబడవని నాకు తెలిసి ఉంటే, నేను నా భార్యతో మాట్లాడేవాడిని, బహుశా మా విడాకులు జరిగేవి కావు. ఇప్పుడు ఆమె నేరుగా మెసేజ్‌లు చూడడం వల్ల పరిస్థితి తీవ్రంగా మారింది.” అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని యాపిల్ సరిగ్గా చెప్పలేదని.. దీనివల్ల తాను 5 మిలియన్ పౌండ్లు నష్టపోయానని.. ఇందుకు గానూ యాపిల్ తనకు 5 మిలియన్ పౌండ్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.53కోట్లు ) చెల్లించాలని దావా వేశాడు. ఈ పిటిషన్‌పై స్థానిక కోర్టు త్వరలో విచారణ జరపనుంది.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!