Site icon NTV Telugu

Alcoholic Dog : యజమాని చనిపోవడంతో మద్యానికి బానిసైన కుక్క

Alcoholic Dog

Alcoholic Dog

పెంపుడు జంతువులను ప్రాణంగా చూసుకునే యజమానులు దూరమైతే అవి ఎంతగానో తల్లడిల్లిపోతాయి. యజమాని చనిపోయినా వారి కోసం ఎదురు చూసే కుక్కల గురించి విన్నాం.. కొన్ని పాలు.. ఓ బుక్కెడు అన్నం పెడితే జీవితాంతం వారిని మర్చిపోకుండా అంటి పెట్టుకుని తిరుగుతాయి కుక్కలు.. అలాంటి ఓ కుక్క తన యజమాని మరణంతో అనారోగ్యంపాలైంది.

Read Also : Heatwave Conditions: ఐఎండీ వార్నింగ్‌.. 126 మండలాల్లో వడగాల్పులు..

ఆ కుక్క యజమానికి మద్యం తాగటం అలవాటు.. తాను ఓ పెగ్ తాగి కుక్కకు కూడా పోసేవాడు.. అలా ఇద్దరు కలిసి నిద్రపోయే ముందు మద్యం తాగటం అలవాటుగా మారింది. ఈ క్రమంలో యాజమాని చనిపోయాడు. ఆ కుక్కకు మద్యం పోసేవారు లేకుండా పోయారు. అలా యజమాని మరణంతో మద్యానికి బానిసైన కుక్కకు మద్యం లేక అనారోగ్యం పాలైంది. యాజమాని లేడు.. మందుపోసే దిక్కులేక ఆ పెంపుడు శునకం హెల్త్ ప్రాబ్లమ్ పాలైంది. అది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాన్ని పరీక్షించిన డాక్డర్లు దానికి వైద్యం చేశారు. అది క్రమంగా కోలుకుంది. ఇలా మద్యానికి బానిసైన కుక్కకు వైద్యం చేయడం అది కోలుకోవడం ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు ఈ ఘటన బ్రిటన్ లో వెలుగులోకి వచ్చింది.

Read Also : WORLD CUP 2023 : మాట మార్చిన పాకిస్థాన్.. ఆ స్టేడియాల్లో ఆడుతామంటూ వెల్లడి

బ్రిటన్ లోని ప్లిమొత్ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి తాగుడుకు బానిస.. అతు లాబ్రడార్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి కోకో అనే పేరు పెట్టుకున్నాడు. దానికి రెండేళ్లు.. అతను తాను తాగటమే కాకుండా పెంపుడు శునకానికి కూడా మద్యం అలవాటు చేశాడు. అలా అతనితో పాటు కోకో కూడా మద్యానికి బాగా అలవాటు పడిపోయింది. టైమ్ అయితే చాలు ఇద్దరు కూర్చుని తాగటమే పనిగా ఉండేది. ఈ క్రమంలో యజమాని మరణించాడు. దీంతో కోకోకు మద్యం పోసేవారు లేకుండా పోయారు.

Read Also : Fake Currency in ATM: ఏటీఎంలో నకిలీ నోట్ల కలకలం.. ఫేక్‌ కరెన్సీ డిపాజిట్‌

దీంతో కోకో తీవ్ర అనారోగ్యం పాలైంది. కోకో అనారోగ్యానికి గుర్తించిన స్థానికులు యానిమల్ రెస్య్కూ ట్రస్ట్ కు అప్పగించారు. మద్యం తాగకపోవడం వల్ల అనారోగ్యం పాలైన కుక్కకు తరచూ ఫిట్స్ వచ్చేవి. ఇంకా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడేది.. ఈ రోగ లక్షణాలను పరిశీలించిన డాక్టర్లు అది మద్యానికి బానిసైందని గుర్తించి చికిత్స్ ప్రారంభించారు. చికిత్సతో కోకో క్రమంగా కోలుకుంది. ఓ కుక్క మద్యానికి బానిసై కోలుకోవడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని డాక్టర్లు వెల్లడించారు.

Exit mobile version