Aadhaar card update: అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అయిపోయింది.. కొన్నింటికి అవసరం లేదు అంటూనే ఆధార్ సేకరిస్తున్నారు.. అలా దానికి ప్రాధాన్యత ఏర్పడింది.. ఇక, ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటితే.. దానిని తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) స్పష్టం చేసిన నేపథ్యంలో.. మరోసారి అంతా ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకుంటున్నారు.. ఇంకా చేసుకోవాల్సినవాళ్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే వారికి ఇప్పుడు యూఐడీఏఐ గుడ్‌న్యూస్ చెప్పింది.. ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 14వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో.. ఆధార్ కార్డ్ హోల్డర్లకు శుభవార్త చెబుతూ.. దీనిని మరో మూడు నెలలు పొడిగించింది.. అంటే డిసెంబర్ 14వ తేదీ వరకు ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొంది.
Read Also:Vegetable: కూరగాయలు నచ్చలేదని.. కొడ్నాప్ చేసి కొట్టి చంపాడు
సాధ్యమైనంత ఎక్కువమంది ఆధార్ కార్డులో తమ డాక్యుమెంట్స్ అప్ డేట్ చేసుకునేలా ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ 14 వరకు ఉన్న గడువును పొడిగించామని యూఐడీఏఐ ఓ ప్రకటన విడుదల చేసింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా ఆధార్ డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసుకోవచ్చు అని సూచించింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌లోని పత్రాలను నవీకరించడానికి చివరి తేదీని సెప్టెంబర్ 14 నుండి డిసెంబర్ 14 వరకు మూడు నెలల పాటు పొడిగించింది. తన ప్రకటనలో UIDAI ఇలా పేర్కొంది, “ఎక్కువ మంది నివాసితులు తమ పత్రాన్ని ఆధార్‌లో అప్‌డేట్ చేసేలా ప్రోత్సహించడానికి, వారి పత్రాన్ని ఆధార్‌లో అప్‌డేట్ చేసే నిబంధనను అందించాలని నిర్ణయించాం.. ప్రజల నుంచి వచ్చిన సానుకూల స్పందన ఆధారంగా, సదుపాయాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని నిర్ణయించబడింది, అంటే సెప్టెంబర్ 15 నుండి డిసెంబర్ 14 వరకు. దీని ప్రకారం, డాక్యుమెంట్ అప్‌డేట్ కోసం సదుపాయం https://లోని myAadhaar పోర్టల్ ద్వారా ఉచితంగా కొనసాగుతుంది. అని స్పష్టం చేసింది.