NTV Telugu Site icon

UGC NET 2025 : యూజీసీ నెట్‌ పరీక్ష వాయిదా…!

Ugc Net

Ugc Net

UGC NET 2025 : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబర్ 2024 సెషన్ పరీక్షలు దేశవ్యాప్తంగా పలు కేంద్రాలలో జరుగుతున్నాయి. జనవరి 3న ప్రారంభమైన ఈ పరీక్షలు జనవరి 16 వరకు కొనసాగనున్నాయి. అయితే, సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 15న జరగవలసిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎన్టీయే పేర్కొంది. జనవరి 16న నిర్వహించవలసిన పరీక్ష మాత్రం యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేసింది.

పరీక్ష తేదీలు:
పరీక్షలు జనవరి 3, 6, 7, 8, 9, 10, 15, 16 తేదీల్లో జరుగుతున్నాయి. పండుగ కారణంగా అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో జనవరి 15న జరగవలసిన పరీక్షను వాయిదా వేసినట్లు ఎన్టీయే తెలిపింది.

పరీక్ష నమూనా:
మొత్తం రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది.
పేపర్ 1లో 50 ప్రశ్నలు (100 మార్కులు), పేపర్ 2లో 100 ప్రశ్నలు (200 మార్కులు) ఉంటాయి.
పరీక్ష మొత్తం 3 గంటల వ్యవధిలో ఉంటుంది.
పేపర్ 1లో రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ పై ప్రశ్నలు ఉంటాయి.
పేపర్ 2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

మీడియం , అర్హత మార్కులు:

లాంగ్వేజెస్ మినహా మిగతా అన్ని ప్రశ్నాపత్రాలు ఇంగ్లిష్, హిందీ భాషలలో మాత్రమే ఉంటాయి.
అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి కనీస అర్హత మార్కులు 40 శాతం, రిజర్వ్డ్ కేటగిరీకి 35 శాతం.
85 సబ్జెక్టుల్లో జరిగే ఈ పరీక్షకు రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు తాజా మార్పులకు సంబంధించి ఎన్‌టీఏ విడుదల చేసే అధికారిక ప్రకటనలను పరిగణనలో ఉంచుకోవడం అవసరం.

Sankranthi Celebrations: కోనసీమను మించేలా పులివెందులలో మొదటిసారి కోడి పందాలు..