తమిళనాడులోని ఎంకే స్టాలిన్ ప్రభుత్వ మంత్రివర్గంలో ఈరోజు భారీ మార్పు చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పుఝల్ సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ తిరిగి మంత్రివర్గంలోకి రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. వీరితో పాటు డాక్టర్ గోవి చెజియాన్, ఆర్ రాజేంద్రన్, ఎస్ఎం నాసర్ కూడా మంత్రి మండలిలో చోటుదక్కించుకున్నారు. తాజాగా రాజ్‌భవన్‌లో వీరు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందారు. దీనితో పాటు, ఆయనకి ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, దిగ్గజ ద్రావిడ నాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ‘కళైంజ్ఞర్’ కరుణానిధి మనవడన్న విషయం తెలిసిందే.
READ MORE: IT employee die: ఆఫీసులోనే కుప్పకూలిన ఐటీ ఉద్యోగి.. పని ఒత్తిడే కారణమా..?
సెంథిల్ బాలాజీ పురాగమనం
తమిళనాడు ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో అత్యంత షాకింగ్ పేరు సెంథిల్ బాలాజీ. సెంథిల్ బాలాజీకి సెప్టెంబర్ 26న సుప్రీంకోర్టు బెయిల్ వచ్చింది. ఏడాది క్రితం సెంథిల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. సెంథిల్ బాలాజీ మనీలాండరింగ్ కేసులో 15 నెలల పాటు జైలులో ఉన్నారు. బాలాజీకి విద్యుత్ శాఖను ముఖ్యమంత్రి కేటాయించారు. జూలై 14, 2023న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసినప్పుడు ఆయన ఎక్సైజ్ శాఖను కలిగి ఉన్నారు. ఎక్సైజ్ శాఖపై తనకు లేని ఆసక్తిని సెంథిల్ బాలాజీ ముఖ్యమంత్రికి చెప్పినట్లు డీఎంకే వర్గాలు తెలిపాయి. అందుకే ఆయనకు విద్యుత్ శాఖ బాధ్యతలు అప్పగించారు.
READ MORE:Instructions To Parents: ఇలా చేస్తే మీ పిల్లల్లో ఆత్మహత్య చేసుకోవాలనే.. కోరిక పుట్టడం ఖాయం!
గోవి చెజియన్‌కు ఉన్నత విద్యా శాఖ కేటాయించడం ఆసక్తికరంగా మారింది. గోవి దళిత నాయకుడు, డీఎంకే చీఫ్ విప్ కూడా. సాపేక్షంగా ప్రాముఖ్యత లేని అటవీ శాఖను కేటాయించిన హై ప్రొఫైల్ మంత్రి కె పొన్ముడి స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. నార్త్ సేలం ఎమ్మెల్యే ఆర్ రాజేంద్రన్‌కు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించారు . సేలం జిల్లాలో ఆయన ఏకైక డీఎంకే ఎమ్మెల్యే. జిల్లాలో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిగిలిన స్థానాలను అన్నాడీఎంకే, పీఎంకే గెలుచుకున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పటికే తన ఉద్దేశాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. గతంలో కేబినెట్ నుంచి తొలగించబడిన కే రామచంద్రన్‌కు ఉన్న టూరిజం శాఖను రాజేంద్రన్‌కు ఇవ్వనున్నారు. డీఎంకెకు చెందిన శక్తివంతమైన ముస్లిం నాయకుడు ఎస్ఎమ్ నాసర్ ను మరో ముస్లిం నాయకుడు జింగీ కె మస్తాన్ స్థానంలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. మైనారిటీ పోర్ట్‌ఫోలియోను నాజర్‌కు కేటాయించారు.