NTV Telugu Site icon

Uddhav Thackeray : ఔను అధికారం కోసమే కలిశాం..

Uddav Takerey

Uddav Takerey

ప్రధాని మోడీ డిగ్రీల వివరాలను అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేల జరిమాన విధించింది. ఈ నేపథ్యంలోనే శివసేన నాయకుడు ఉద్దవ్ థాకరే ప్రధాని మోడీ డిగ్రీ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేని యువకులు ఎంతోమంది ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఈ ప్రధాని మోడీని డిగ్రీ చూపించమని అడిగితే జరిమానా విధిస్తారేంటి అని సెటైర్లు వేశారు. అయినా మా కాలేజీలోనే మోడీ చదువుకున్నాడని గర్వంగా ఫీలవుతూ ఏ కాలేజీ చెప్పేందుకు ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ ఉద్దవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Covid-19 Vaccines : భారీగా కోవిద్ వ్యాక్సిన్లు ధ్వంసం చేసిన అధికారులు

నిజానికి అసలు ప్రధాని చదువుకున్నారా అంటూ ఉద్దవ్ థాకరే అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతోనే సైద్దాంతికంగా భిన్నమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలకు థాకరే గట్టి సమాధానం ఇచ్చారు. ఔను మేము అధికారం కోసమే కలిశాం.. కానీ దానిని కోల్పోయినప్పటికీ ఇంకా కలిసే ఉన్నాం.. మరింత బలంగా ఉన్నాం.. అని ఉద్దవ్ బదులిచ్చాడు. అలాగే సేన నాయకుడు ఏక్ నాథ్ షిండే-40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి బీజేపీతో కొత్త ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారో ప్రస్తావిస్తూ.. అవకాశం కుదిరినప్పుడల్లా బీజేపీ ప్రజలను లోబర్చుకుంటుందని.. సరిగ్గా ఎన్నికల సమయంలో మాయమాటలతో మోసం చేస్తోందని ఉద్దవ్ థాకరే ఆరోపించారు.

Also Read : Indian 2: అయిదేళ్ల తర్వాత మళ్లీ అదే చోటుకి శంకర్ అండ్ టీమ్…

కాగా, బీజేపీ తనను హిందూత్వాన్ని విడిచిపెట్టానని నిందలు వేస్తోంది. నేను హిందూత్వాన్ని విడిచిపెడుతున్నాను అనడానికి ఒక్క ఉదాహరణ చెప్పగలారా.. రాజ్యంగంపై ప్రమాణం చేసేందుకు నేను సిద్దమే మీరు ధృవీకరించగలరా అని ప్రశ్నిస్తే.. అదిగో రాజ్యంగాన్ని అవమానిస్తున్నారంటూ ఆరోపిస్తున్న.. బీజేపీ వితండ వాదన చేస్తోందన్నారు. న్యాయవ్యవస్థను సైతం బీజేపీ నియంత్రించడానికి ప్రయత్నించింది. కానీ అదృష్టవశాత్తు న్యాయవ్యవస్థ అందుకు అంగీకరించ లేదన్నారు. లేదంటే ఇజ్రాయెల్ మాదిరి పరిస్థితి మన దేశంలో కూడా తల్లెత్తేది అంటూ బీజేపీకి ఉద్దవ్ థాకరే గట్టి కౌంటరిచ్చాడు.