Good News : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏడాది పాటు పెయిడ్ లీవ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good News : ప్రభుత్వం ఉద్యోగులను ప్రోత్సహించేందుకు యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కోరుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఏడాది పాటు పెయిడ్ హాలీడేస్ తీసుకోవచ్చని ప్రకటించింది. సెలవులో ఉన్నంత కాలం ఉద్యోగులకు సగం జీతం అందుతుంది. ఈ కాన్సెప్ట్‌ను తొలిసారిగా యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జూలైలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారిని వ్యాపారాల్లో ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. యూఏఈ వాసులు వ్యాపారాలు చేయడం ద్వారా కొత్త ఉద్యోగాలను కల్పించే వీలుంటుంది. అలాగే ఆర్థికంగా పరిపుష్టిని పొందగలుగుతారని యూఏఈ అధికారులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నిర్ణయం మరే దేశంలో తీసుకోలేదు.
Read Also: Guvvala Balaraju : ఎమ్మెల్యే బాలరాజుకు డాక్టరేట్.. అవార్డు ప్రదానం చేసిన ఓయూ
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
యూఏఈ యువతరం ప్రభుత్వం ప్రవేశపెట్టే వాణిజ్య ప్రయోజన పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చునన్నది షేక్ మొహమ్మద్ కోరిక. వ్యాపారం కోసం ఏడాది సెలవు మంజూరును ఆ ఉద్యోగి శాఖాధిపతి నిర్ణయిస్తారు. ఇందుకు కొన్ని షరతులు కూడా విధించారు. సెలవు కోరుకునే వారు ముందుగా వెబ్‌సైట్‌లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే దరఖాస్తు పెట్టుకోవాలి. గత ఏడాదిలో ఉద్యోగులకు బహుమతులు ప్రకటించిన ప్రభుత్వం.. జనవరి 1 నుంచి పని గంటలను నాలుగున్నర రోజులకు కుదించారు. మిగతా రెండున్నర రోజులు సెలవు దినాలు. ఇలా ప్రకటించిన ప్రభుత్వం ప్రపంచంలో ఇదొక్కటే కావడం విశేషం. ఈ ప్రభుత్వ ఈ ప్రకటనతో దుబాయ్, అబుదాబిలోని ఉద్యోగులు చాలా సంతోషిస్తున్నారు. 1971 నుంచి 1999 వరకు దేశంలో 6 పని దినాలు ఉండేవి. 1999లో 5 రోజులకు, ఇప్పుడు నాలుగున్నర రోజులకు మార్చారు.
تبدأ حكومة دولة الإمارات مطلع يناير 2023، تطبيق إجازة التفرغ للعمل الحر لموظفي الحكومة الاتحادية من المواطنين، التي اعتمدها مجلس الوزراء ضمن مشاريع الخمسين، في مبادرة هي الأولى من نوعها عالمياً.
لتفاصيل أوفى..اضغط على الرابط:https://t.co/PoCuTW9ELl pic.twitter.com/3MCJ83VIta
— FAHR (@FAHR_UAE) December 27, 2022
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!