Guvvala Balaraju : న్యాయ శాస్త్రంలో పరిశోధన చేసినందుకు ఉస్మానియా యూనివర్సిటీ విభాగం ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ‘భారతదేశంలో శాసన సభ్యుల శాసనాధికారాలు వాటి పై న్యాయసమీక్ష’ అనే అంశం పై నాలుగేళ్లుగా బాలరాజు పరిశోధన చేశారు. ఈ క్రమంలో ఆయన ఉస్మానియా యూనివర్సిటీ న్యాయా కళాశాలల్లో న్యాయశాస్త్రంలో పరిశోధక విద్యార్థిగా ఉన్నారు.
Read Also: Revanth Reddy : ‘కల్వకుంట్ల రాజ్యంలో మాయమైపోయిన తెలంగాణం’
గురువారం తన పర్యవేక్షకుడు ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, డీన్ ఫాకల్టీ అఫ్ లా గాలి వినోద్ కుమార్, బోర్డు అఫ్ స్టడీస్ ఛైర్ పర్సన్ డాక్టర్ అపర్ణ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాధికా యాదవ్, అసోసియేట్ ప్రొఫెసర్ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే బాలరాజుకు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ భారత రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం నాయకులు గువ్వల బాలరాజును ఘనంగా సన్మానించారు.
Read Also: TSPSC Group 2: తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల