Dowry Harassment: వద్దన్నా వదల్లేదు.. కత్తితో గొంతు కోసి చంపి గోనెసంచిలో పెట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dowry Harassment: రోజు రోజుకు సమాజంలో మానవత్వం కనుమరుగైపోతుంది. ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితికి మనిషి దిగజారి..క్రూరంగా మారిపోతున్నాడు. తనను నమ్మి వచ్చిన వారిని అత్యంత కిరాతకంగా చంపి రాక్షస ఆనందాన్ని పొందుతున్నాడు. ఢిల్లీలో శ్రద్ధా దారుణ హత్య మరవక ముందే.. తాజాగా రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన 25 రోజులకే ఓ వ్యక్తి తన భార్యను గొంతు కోసి అతి క్రూరంగా హతమార్చాడు. అంతేకాకుండా ఆమె శవాన్ని గోనె సంచిలో పెట్టి అడవిలో పడేశాడు. అజ్మీర్ జిల్లాలోని క్రిస్టియన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది.
Read Also: Zakir Naik : మేం ఆయనను పిలువలేదు.. జకీర్ ఖాన్ పై క్లారిటీ ఇచ్చిన ఖతార్
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
ఈ దంపతులు 26 రోజుల క్రితం ప్రేమవివాహం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకా నగర్ స్ట్రీట్ నంబర్-4లో నివసించే ముఖేష్ సింధీ (34) నయాబజార్‌లో బట్టల షాప్ నడుపుతున్నాడు. గతేడాది ఆగస్టులో ముఖేష్ స్నేహితుడు రమేష్ .. భగవాన్ గంజ్‌లో నివసించే జెన్నిఫర్ (32)ని పరిచయం చేశాడు. ఇద్దరు ప్రేమించుకుని 26 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో గొడవలు స్టార్ట్ అయ్యాయి. బుధవారం ఉదయం ముఖేష్, జెన్నిఫర్ మధ్య పెద్ద గొడవ జరిగింది. నన్ను క్షమించండి, ఇంకా ఎప్పుడూ అలా చేయనని జెన్నిఫర్ .. తన భర్తను వేడుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొంతసేపటికి ఇంట్లో నుంచి శబ్దాలు ఆగిపోయాయని.. కొంతసేపటికి ముఖేష్ .. ఓ గొనె సంచితో బయటికి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ సంచిని స్కూటీపై ఉంచుతుండగా కిందపడినప్పుడు ఆమె మృతదేహాన్ని చూసినట్లు వారు చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Read Also:Udayanidhi Stalin: కొడుక్కి మళ్లీ కీలక పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తాళం పగలగొట్టి పరిశీలించారు. అక్కడ రక్తపు ఆనవాళ్లు కనిపించాయి. ఇంతలో.. మృతదేహాన్ని బయట పడేసి ముఖేష్ ఇంటికి వచ్చాడు. అక్కడ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు కలెక్టరేట్ సమీపంలో ముఖేష్ ను పట్టుకున్నారు. పోలీసుల తమదైనశైలి విచారించగా తన భార్యను హత్య చేసి మృతదేహాన్ని పుష్కర్ ప్రాంతంలో పడేసినట్లు భర్త చెప్పాడు. ప్రస్తుతం నిందితుడు ముఖేష్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. జెన్నిఫర్ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ ఆమె తల్లి పెంచింది. బాధితురాలి సోదరుడు ముఖేష్ కట్నం డిమాండ్ చేస్తున్నాడని .. ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదు చేశాడు.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!