Site icon NTV Telugu

Womens Marriage: ముస్లిం యువకులు హిందువులుగా నటిస్తూ మోసం చేశారు.. అందుకే ఒక్కటయ్యాం..!

Womens Marriage

Womens Marriage

Womens Marriage: ఉత్తరప్రదేశ్‌ లోని బదాయూన్ జిల్లాలో అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువతులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని ఆలయంలో వీరు ఒకరికి ఒకరు పూలమాలలు మార్చుకొని, జీవితాంతం కలిసే ఉండాలని ప్రమాణాలు చేసుకున్నారు. అలాపూర్ పట్టణానికి చెందిన ఆశ అనే యువతి, సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన జ్యోతి అనే యువతిని పెళ్లి చేసుకుని తన భార్యగా అంగీకరించింది. ఆశ తన పేరును కూడా ‘గోలూ’గా మార్చుకున్నది. ఆశ ప్రస్తుతం ఢిల్లీలోని పశ్చిమ విహార్ ప్రాంతంలోని ఓ బేబీ కేర్ సెంటర్‌లో పనిచేస్తోంది. ఆమెకు ఐదుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్లున్నారు.

Read Also: Michael Rubin: పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది..

ఇక జ్యోతి ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని దేరాదూన్‌లో ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డ్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఓ చెల్లెలు ఉంది. సుమారు మూడు నెలల క్రితం జిల్లా కోర్టు ప్రాంగణంలో వీరిద్దరి పరిచయం జరిగింది. ఆ తరవాత మాట్లాడుకోవడం ద్వారా ఒకరిపై ఒకరికి ఇష్టం పెరిగింది. అలా చివరికి జీవితాంతం కలిసి ఉండాలన్న నిర్ణయం తీసుకున్నారు.

Read Also: AP Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో సిట్ కస్టడీలోకి సజ్జల శ్రీధర్ రెడ్డి..

ఇక ఈ ఘటన తర్వాత వీరు మాట్లాడుతూ.. ముస్లిం యువకులు హిందువులుగా నటిస్తూ మమ్మల్ని మోసగించారు. ఆ మోసం తెలిసిన తర్వాత మేము మానసికంగా బాగా క్షోభించాం. అప్పటి నుంచి మాకు మగవాళ్లపై నమ్మకం లేకుండా పోయింది. అందుకే ఒకరినొకరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మేము భార్యాభర్తలుగా జీవించబోతున్నాం అని వివరించారు. ఈ వివాహం, జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆలయంలో కొంతమంది న్యాయవాదుల సమక్షంలో జరిగింది.

Exit mobile version