Site icon NTV Telugu

Uttar Pradesh: దారుణం.. అబ్బాయిలతో బలవంతంగా మూత్రం తాగించి.. ప్రైవేట్‌ పార్ట్‌లో మిరపకాయలు రుద్ది..

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఇద్దరు మైనర్ బాలురకు మూత్రం తాగించి, వారి మలద్వారంలో పచ్చిమిర్చి రుద్దారు. దొంగతనం చేశారనే అనుమానంతో బలవంతంగా కొన్ని గుర్తు తెలియని ఇంజెక్షన్లు ఇచ్చారు. బాధితులు 10, 15 సంవత్సరాల వయస్సు గల బాలురు కావడం గమనార్హం. దాడికి సంబంధించిన భయానక వీడియోల్లో ఆ అబ్బాయిలను పచ్చి మిరపకాయలు తినేలా చేసి, బాటిల్‌లో నింపిన మూత్రాన్ని తాగాలని బలవంతపెట్టారు. కొంతమంది వ్యక్తులు వారిని దుర్భాషలాడడం, దానిని దాటవేయకపోతే కొడతామని బెదిరించడం ఆ వీడియోలో కనిపించింది. డబ్బు దొంగిలించారని ఆరోపిస్తూ గూండాలు అబ్బాయిలను పట్టుకుని కట్టివేశారు.

Also Read: Tomato: రెండు నెలల్లో టమాటా అమ్మి కోటీశ్వరుడయ్యాడు.. కారు, ట్రాక్టర్ కొన్నాడు

మరొక కలతపెట్టే వీడియోలో అబ్బాయిల చేతులను వెనుకకు కట్టి, ప్యాంటు క్రిందికి లాగి నేలపై పడుకుని ఉండగా, ఒక వ్యక్తి వారి మలద్వారంలో పచ్చి మిరపకాయలను రుద్దడం కనిపించింది. నొప్పితో అరుస్తున్న అబ్బాయిలకు పసుపు రంగు ద్రవాన్ని కూడా ఇంజెక్ట్ చేశారు. ఆగస్టు 4న చిత్రీకరించిన ఈ వీడియో జిల్లాలోని పత్రా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంకటి చౌరాహా సమీపంలోని అర్షన్ చికెన్ షాప్ నుంచి వచ్చినట్లు తెలిసింది. “ఇద్దరు పిల్లలపై అభ్యంతరకర చర్య” అనే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో తక్షణమే గుర్తించామని, చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించామని, వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ తెలిపారు.

 

Exit mobile version