Train Accident: బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ.. 15 మంది మృతి, 100 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Accident: బంగ్లాదేశ్ రాజధాని సమీపంలో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 100 మందికి గాయాలయ్యాయి. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. కిషోర్‌గంజ్‌లోని భైరబ్ వద్ద మధ్యాహ్నం గూడ్స్ రైలు ప్యాసింజర్ రైలును ఢీకొట్టిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Also: Gunturu Kaaram: మరణ మాస్ లుక్ లో మహేష్.. ఇంతకన్నా ఏం కావాలమ్మా
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరబ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసు అధికారి సిరాజుల్ ఇస్లాం తెలిపారు. రైలు కింద పలువురు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చాలా మంది కోచ్‌ల కింద పడి ఉన్నారని.. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Read Also: Ponguleti: కాళేశ్వరంపై సీవీసీ విచారణ జరపాలి
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని తరలించడంలో స్థానిక ప్రజలు కూడా సహాయం చేస్తున్నారు. రెండు కోచ్‌లు ఢీకొనడంతో గూడ్స్ రైలు ఎగరో సింధూర్‌పై వెనుక నుంచి దూసుకెళ్లిందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని ఢాకా రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ అన్వర్ హొస్సేన్ తెలిపారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?