Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Two Tourists From America Drunk And Sleeping On The Eiffel Tower

Tourist Sleep On Eiffel Tower: అరే ఏంట్రా ఇది….తాగి ఈఫిల్ టవర్ పైకెక్కి నిద్రపోయిన టూరిస్ట్‌లు

Published Date :August 17, 2023 , 10:53 am
By Sravani
Tourist Sleep On Eiffel Tower: అరే ఏంట్రా ఇది….తాగి ఈఫిల్ టవర్ పైకెక్కి నిద్రపోయిన టూరిస్ట్‌లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఫ్రాన్స్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు ఈఫిల్ టవర్. ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల్లో ఇది కూడా ఒకటి. దీనిని చూసేందుకు లక్షల్లో టూరిస్ట్ లు పారిస్ కు ప్రతి యేటా క్యూ కడుతూ ఉంటారు. సినిమాల్లో కూడా దీనిని ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటారు. ఇక అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు సినిమాలో అయితే ఈఫిల్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. అంత ఎతైన ఈఫిల్ టవర్ నుంచి పారిస్ నగరాన్ని చూడాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు.  ఈ టవర్ లోని చివరి రెండు అంతస్తులకు వెళ్లడానికి టూరిస్టులకు అనుమతి ఉండదు. అయితే అమెరికాకు చెందిన ఇద్దరు టూరిస్టులు మాత్రం తప్పతాగి మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియక అనుమతిలేని ఈ రెండు టవర్లు ఎక్కి నిద్రపోయారు. అనంతరం జైలు పాలయ్యారు.

ఆగస్టు 13 న ఈ సంఘటన జరిగింది. అమెరికా నుంచి ఇద్దరు టూరిస్టులు ఆగస్టు 13న రాత్రి 10.40 గంటలకు టికెట్లు తీసుకొని ఈఫిల్ టవర్ ఎక్కారు. అప్పటికే వారు తాగి ఉన్నారు. మద్యం మత్తులో వారు అనుమతిలేని చివరిదైన రెండో లెవల్ కు వెళ్లారు. సందర్శన సమయం అయిపోయేసరికి ఆ రోజు అందరిని ఈఫిల్ టవర్ సిబ్బంది కిందకు పంపించేసింది. అయితే వీరు మాత్రం భద్రతా సిబ్బంది కళ్లుగప్పి చివరి రెండో లెవల్ కు చేరుకోవడంతో పోలీసులు వీరిని గుర్తించలేకపోయారు. పీకల దాక తాగి ఉండటంతో మద్యం మత్తులో కిందకి దిగలేక వారు అక్కడే హాయిగా నిద్రపోయారు. తరువాతి రోజు ఉదయం భద్రతా సిబ్బంది గస్తీ చేస్తున్న సమయంలో అనుమతిలేని ప్రాంతంలో టూరిస్ట్‌లు నిద్రపోతున్న దృశ్యాన్ని చూసి షాకయ్యారు. దీంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్‌పైటర్లు, రెస్క్యూ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. వారిని అంత ఎత్తు నుంచి జాగ్రత్త దించారు. అయితే అనంతరం ఆ ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Also Read: Honor 90: హానర్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. సరికొత్త మోడళ్లతో ఇండియాలోకి రీఎంట్రీ

అయితే గతంలో కూడా ఈఫెల్ టవర్ లో బాంబు పెట్టనట్లు ఫోన్లు వచ్చాయి. దీంతో టవర్‌, పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని.. సందర్శకులను బయటకు పంపి పోలీసులు అణువణువు తనిఖీ చేశారు. ఎటువంటి అనుమానిత వస్తువుల లభ్యం కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వారి అచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలా టూరిస్టులు నిద్రపోయిన విషయం ప్రాధాన్యతను సంతరించుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • Eiffel Tower
  • Paris
  • Sleep
  • Tourists

తాజావార్తలు

  • Salman Khan: ఇదేం ఫ్యాషన్ భాయ్? సల్మాన్ ఖాన్ ఖరీదైన బూట్ల చెరిగినట్లు ఉన్నాయే!

  • Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం.. మారనున్న ఆ రైల్వే స్టేషన్ రూపురేఖలు..

  • AP Weather Forecast: ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు.. రెండు రోజులు వర్షాలు, వడగాలులు!

  • KKR vs PBKS: రెండు మార్పులతో బరిలోకి కోల్‌కతా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..?

  • CM Revanth Reddy: తెలంగాణ ఆడపడుచులకు ఎగిరిగంతేసే వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions