అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. జలపాతంలో మునిగిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో లక్కిరెడ్డి రాకేష్ రెడ్డి, రోహిత్ మణికంఠ లేపాల అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన అమెరికాలోని అరిజోనాలోని ఫజిల్ క్రీక్ ఫాల్స్ వద్ద చోటుచేసుకుంది. మే 8వ తేదీన 16 మంది స్నేహితుల బృందం స్నాతకోత్సవం కోసం ఈ జలపాతం వద్దకు వెళ్లారు. ఈ ఘటన జరిగినప్పుడు రాకేష్, రోహిత్ జలపాతంలో ఈత కొడుతున్నప్పుడు ఈ దుర్ఘటన ఎదురైంది.
Also Read: Revanth Reddy: HCU విద్యార్థులతో ఫుట్‌బాల్ ఆడిన రేవంత్ రెడ్డి..
ఆందోళన చెందిన స్నేహితులు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని వెతికే పనిని ప్రారంభించారు. మొదటి రోజు వారిని కనుగొనలేకపోయారు. రెండవ రోజు వారి మృతదేహలను కనుగొన్నారు. వీరిలో ఖమ్మం పట్టణానికి చెందిన విద్యారంగ ప్రముఖుడైన రాకిరిడి చంద్రశేఖర్ రెడ్డి ఏకైక కుమారుడు రాకేష్ రెడ్డి. అతను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్న రోహిత్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: Char Dham Yatra : యమునోత్రికి భక్తుల వరద.. దయచేసి రావొద్దంటున్న పోలీసులు
ఇటీవల రాకేష్ తల్లిదండ్రులు కూడా తమ కుమారుడి స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. అయితే అనుకోని ప్రమాదంలో ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది.