అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. జలపాతంలో మునిగిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో లక్కిరెడ్డి రాకేష్ రెడ్డి, రోహిత్ మణికంఠ లేపాల అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన అమెరికాలోని అరిజోనాలోని ఫజిల్ క్రీక్ ఫాల్స్ వద్ద చోటుచేసుకుంది. మే 8వ తేదీన 16 మంది స్నేహితుల బృందం స్నాతకోత్సవం కోసం ఈ జలపాతం వద్దకు వెళ్లారు. ఈ ఘటన జరిగినప్పుడు రాకేష్, రోహిత్ జలపాతంలో ఈత కొడుతున్నప్పుడు…