Site icon NTV Telugu

NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్ టెక్నిషియన్స్

Nbk 112

Nbk 112

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నారు. అఖండ నుండి మొదలైన బాలయ్య 2.O ఊహించని విధంగా సాగుతోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ లోగా నెక్ట్స్ సినిమాపై ఫోకస్ చేసాడు బాలయ్య. ఇప్పటి వరకు సీనియర్ దర్శకులతో సినిమాలు చేస్తూ వచ్చిన నందమూరి హీరో ఇప్పుడు యంగ్ దర్శకుడు వివేక్ ఆత్రేయకు ఛాన్స్ ఇచ్చాడు.   

Also Read :Arere Arere Song : సినీ ప్రముఖుల సమక్షంలో ‘అరెరే.. అరెరే’ మ్యూజిక్ వీడియో విడుదల!

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చిత్ర యూనిట్ ఇద్దరు యువ మరియు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను రంగంలోకి దించినట్లు సమాచారం. మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. గతంలో తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’  నాని హీరోగా వచ్చిన ‘సరిపోదా శనివారం’ చిత్రాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు పాటలతో ఆకట్టుకున్నారు జేక్స్ బిజోయ్. బాలయ్య మార్కు మాస్ ఎలిమెంట్స్‌కు జేక్స్ బిజోయ్ తనదైన శైలిలో ఎలాంటి మ్యూజిక్ ఇస్తారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా విజువల్స్ బాధ్యతను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జి. మురళి చేపట్టబోతున్నారు. ఈయన గతంలో ‘అందాల రాక్షసి’  రజనీకాంత్ ‘కబాలి’ మరియు నాని ‘సరిపోదా శనివారం’ వంటి భారీ చిత్రాలకు పనిచేశారు. మురళి కెమెరా పనితనం సినిమాకు ఒక కొత్త లుక్ తీసుకువస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. అఫీషియల్ ప్రకటన రాకముందే ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ ఇద్దరు టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఆన్ బోర్డ్ రావడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. మైత్రి మూవీస్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారక ప్రకటన రానుంది.

Exit mobile version