Arere Arere Song : సినీ ప్రముఖుల సమక్షంలో ‘అరెరే.. అరెరే’ మ్యూజిక్ వీడియో విడుదల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సింగర్, నటి దియా అందించిన ‘అరెరే.. అరెరే’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌ను ఘనంగా విడుదల చేశారు. బటర్‌ఫ్లై మ్యూజిక్ బ్యానర్‌పై రూపొందిన ఈ వీడియో విడుదల వేడుక సినీ ప్రముఖుల సందడితో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, హీరో పూరి ఆకాష్ సహా సినీ ప్రముఖులు సమీర్, సాగర్, ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు ఆర్టిస్ట్ శివారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అందరూ మ్యూజిక్ వీడియోను విడుదల చేసి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
సింగర్ దియా మాట్లాడుతూ… ఈ ఆల్బమ్ రూపుదిద్దుకోవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి ప్రాజెక్ట్‌ను విజయవంతం చేసిన టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన అతిథులందరికీ రుణపడి ఉంటానని, ప్రేక్షకుల ప్రేమే తనకు ప్రధాన బలం అని పేర్కొన్నారు. హీరో పూరి ఆకాష్ మాట్లాడుతూ.. దియాతో ‘మహబూబ’ సినిమాలో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పాటలో ఆమె కేవలం నటించిందని అనుకున్నానని, కానీ స్వయంగా పాడిందని తెలుసుకుని ఆశ్చర్యపోయానని అన్నారు. దియా చాలా ప్రతిభావంతురాలని, ఇలాంటి యువ టాలెంట్‌ను అందరూ ప్రోత్సహించాలని కోరారు. ఈ ఆల్బమ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకాన్ని వ్యక్తం చేసింది.
Also Read
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
- Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
తాజావార్తలు
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!