Mobile Phones: ఇటీవల కాలంలో ఇంటిలో ఖాళీగా ఉంటే టీవీ లేదా మొబైల్ చూస్తాం. ఈ మధ్య చిన్నపిల్లలు కూడా అదే పరిస్థితికి వచ్చారు. వారి దగ్గర ఫోన్ లేక తల్లిదండ్రులను కొనమని హింసిస్తారు. వారు పిల్లలు చెడుపోతారెమో అని భయంతో మెుబైల్ కొనడానికి సంకోచిస్తారు. అయితే పిల్లలు అనుకొన్నది ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తారు. తాజాగా ఇద్దరు విద్యార్థులు గుజరాత్‌లో వేర్వేరు ఘటనల్లో మొబైల్ ఫోన్ ఇవ్వడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చిన ఈ ఘటనలు గుజరాత్‌లో ఒకేరోజు చోటుచేసుకున్నాయి. గుజరాత్‌లో 9వ తరగతి, 12వ తరగతి విద్యార్థులు తమ తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు ఇవ్వడానికి నిరాకరించడంతో వారి జీవితాలను ముగించారు. సూరత్‌కు చెందిన ఒక విద్యార్థి, రాజ్‌కోట్‌లోని ఒక గ్రామానికి చెందిన మరొకరు మొబైల్ ఫోన్లు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మొదటి సంఘటనలో.. సూరత్‌లోని వరచా ప్రాంతంలో 9వ తరగతి విద్యార్థిని నెల రోజుల క్రితం తన తల్లిదండ్రుల నుండి మొబైల్ ఫోన్ కొనివ్వమని డిమాండ్ చేసింది. పరీక్షలపై దృష్టి సారించాలని తండ్రి ఆమెకు మొబైల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించాడు. అయితే, పరీక్ష తర్వాత ఆమె కోసం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తానని చెప్పాడు. అయితే విద్యార్థి వెంటనే మొబైల్ ఫోన్ కావాలని కోరింది. పలుమార్లు నిరాకరించడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది.
Read Also: Kidney For Sale: భరణం కోసం భార్య వేధింపులు.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త
మరో ఘటనలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన తండ్రి తన మొబైల్ ఫోన్‌ను పాఠశాలకు తీసుకెళ్లవద్దని చెప్పడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఇది వాగ్వాదానికి దారి తీసింది. తండ్రి నిర్ణయంతో మనస్తాపానికి గురైన ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు ఘటనల్లో పోలీసులు ఏడీఆర్ నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. ఈ రోజుల్లో విద్యార్థులు ఫోన్‌లు, ఇతర గాడ్జెట్‌లకు ఎక్కువగా బానిసలయ్యారు. ఇది తరచుగా తీవ్రమైన నేరాలకు దారి తీస్తోంది. మొబైల్ ఫోన్లకు బానిసలైన పిల్లలకు కౌన్సెలింగ్ తప్పనిసరి అని నిపుణులు, పోలీసు అధికారులు తెలిపారు.