NTV Telugu Site icon

MLA Raja Singh : నా ఫోటోలు, నా ఇంటి లొకేషన్‌ను ముంబైలోని ఎవరో వ్యక్తికి ఫార్వర్డ్ చేశారు

Mla Rajasingh

Mla Rajasingh

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. వారిద్దరినీ మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఇస్మాయిల్, మహ్మద్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులు బీజేపీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర తిరుగుతుండగా వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్‌ఓ) వారిని పట్టుకుని భౌతికంగా తనిఖీ చేసిన తర్వాత మంగళ్‌హాత్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి వారి పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 27 మధ్య రాత్రి 2 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చి రెక్కీ చేశారని, నా ఇంటి ఫోటోలు & వీడియోలు తీశారని తెలిపారు. అనుమానం వచ్చి స్థానికులు వాళ్ళని పట్టుకున్నారని, అందులో మరో ఇద్దరు పరార్ అయ్యారన్నారు. స్థానికులు వారి ఫోన్ తెరిచి చూడగా నా ఫోటోలు & నా ఇంటి లొకేషన్‌ను ముంబైలోని ఎవరో వ్యక్తికి ఫార్వర్డ్ చేశారని, ఇద్దరు యువకులను మంగళ్‌హాట్‌ పోలీసులకు అప్పగించారన్నారు. పోలీసుల విచారణ సాగుతోందని ఆయన తెలిపారు.

 

Merugu Nagarjuna: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది..
 

అంతేకాకుండా..’అయితే నేను వెంటనే ఈ విషయం కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కి కాల్ చేసి చెప్పాను.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేద్దమన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.. ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్నా నిందితుడి గురించి పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. 2010లో కూడా నా ఇంటి వద్ద రెక్కీ చేశారు. గతంలో ISI ఏజెంట్‌ను అరెస్టు చేశారు. తరువాత కూడా చాలాసార్లు నా గురించి రెకి జరిగింది. ఇప్పుడు నా ఇంటివద్ద రెక్కీ చేసిన వారు షేక్ ఇస్మాయిల్ వయస్సు (30), మహ్మద్ ఖాజా (24) బోరబండ ప్రాంతమని తెలుస్తుంది. ఎందుకోసం నా ఇంటికి వచ్చారు విరి వెనుక ఎవరున్నారు ఏం కుట్రా జరుగుతోంది తెలియాలి.. గతంలో కూడా నేను చాలా సార్లు చెప్పాను నాకు ఈ పోలీసులపై నమ్మకం లేదని’ అని రాజాసింగ్‌ అన్నారు.

Swag : విష్ణు స్వాగ్ మూవీ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్