ఢిల్లీ మెట్రో.. వివాదాలకు కేరాఫ్ అడ్డగా మారింది. ఇప్పటి వరకు పాటలు, రీల్స్, లవ్ స్టోరీలు, ముద్దుల వీడియోలు మాత్రమే మనం చూశాం.. కానీ తాజాగా ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ మెట్రోలోని కోచ్ రణరంగంగా మారిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే.. ఈ గొడవపై మెట్రో అధికారులు స్పందించారు. తరుచూ ఇలాంటి ఘటనలు ఢిల్లీ మెట్రోలో జరుగడం సాధారణమైపోయింది.
Read Also: Share Market : బక్రీద్ పండుగ.. బిలియనీర్లకు 45 వేల కోట్ల బహుమతి ఇచ్చిన షేర్ మార్కెట్
ఢిల్లీ మెట్రోలో మరోసారి జరిగిన గొడవకు సంబంధించిన వీడియోను @sbgreen17 అనే ట్విట్టర్ యూజర్ అతని ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. చాలామంది ప్రయాణికులతో రద్దీగా ఉన్న మెట్రోలో ఇద్దరు యువకులు యువకులు ఒకరినొకరు కొట్టుకోవడం.. దూరంగా నెట్టుకోవడం కనిపిస్తుంది. వారిని ఆపేందుకు తోటి ప్రయాణికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ వీడియోపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
Read Also: Jithender Reddy: సంచలనంగా మారిన మాజీ ఎంపీ ట్వీట్.. టి.బీజేపీకి ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరం..!
మెట్రోలో ప్రయాణికులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని అభ్యర్థిస్తున్నాము.. ఇతర ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లైతే వెంటనే DMRC హెల్ప్ లైన్‌లో విషయాన్ని తెలియజేయాలి ఢిల్లీ మెట్రో అధికారులు పేర్కొన్నారు. దీంతో DMRC ప్లయింగ్ స్క్వాడ్‌లను కూడా నియమించింది. మెట్రోలో ప్రవర్తన సరిగ్గా లేని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అవసరమైతే కఠిన శిక్ష పడేలా చేస్తామని మెట్రో అధికారులు వెల్లడించారు. మెట్రోలో జరుగుతు అసాంఘిక చర్యలు పట్ల సెక్యూ రిటీ సిబ్బందిని ఎక్కువగా రంగంలోకి దింగుతున్నట్లు DMRC కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ దయాల్ తెలిపారు.