Site icon NTV Telugu

Kuwait Fire Tragedy: కువైట్ అగ్నిప్రమాద మృతుల్లో ఏపీకి చెందిన ముగ్గురు.. ఇద్దరు పెరవలి వాసులే..!

Ap

Ap

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో విషాదం అలుముకుంది. కువైట్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు మృతి చెందారు. బ్రతుకు దెరువు కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశమైన కువైట్ కు వెళ్లిన వ్యక్తులు భారతీయ కార్మికులు నివాసముండే బహుళ అంతస్థ భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే..

Read Also: CM Revanth Tweet: ఒక జర్నలిస్టు నాకు ఫోటో పంపాడు.. అది చూస్తుంటే..

తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలోని అన్నవరప్పాడు, ఖండవల్లి గ్రామాలకు చెందిన ఇరువురు వ్యక్తులు బుధవారం కువైట్ దేశంలో బహుళ అంతస్థ భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం ఖండవల్లి గ్రామానికి చెందిన మొల్లేటి ముక్తేశ్వరరావు భార్య రాఘవులు గ్రామంలో వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. 2వ కుమారుడు మొల్లేటి సత్యనారాయణ వయసు(38) ఇతనికి సుమారు 20 సంవత్సరాలు క్రితం అనంతలక్ష్మితో వివాహం అయింది. వీరికి వెంకట సాయి వయసు(19) కుమారుడు ఉన్నాడు. ఇతను ఉపాధి కోసం 12 సంవత్సరాల క్రితం కువైట్ వెళ్లి.. ఒక సూపర్ మార్కెట్ లో హెల్పర్ గా పని చేస్తూ అక్కడ వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండుమూడెళ్లకు ఒక్కసారి ఇండియాకు వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో గ్రామంలో సొంత ఇల్లు నిర్మాణం చేస్తే గృహ ప్రవేశంనకు వచ్చి వెళ్ళాడు. బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నికీలలకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు.

Read Also: Allahabad High Court: “ఎప్పుడూ మగవారిదే తప్పు కాదు”.. రేప్ కేసులో సంచలన తీర్పు..

అలాగే, పదేళ్ల క్రితం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన నారాయణరావు సీతామాలక్ష్మి దంపతుల కుమారుడు మీసాల ఈశ్వరుడు వయసు(40) ఇతను కూడా అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఇతను పెద్దగా చదువుకోలేదు అని పోలీసులు తెలిపారు. అయితే, వ్యవసాయ కూలీ పనులు చేస్తూ 10 సంవత్సరాల క్రితం కువైట్ దేశం వెళ్లారు. అప్పటి నుండి అక్కడ సూపర్ మార్కెట్లోనే పని చేస్తున్నాడు. తన భార్య చిట్టి కాసులు, కుమారుడు సాయి మణికంఠ, కుమార్తె కోమలి కృష్ణ కుమారి ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది అని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version