medchal sucide: మేడ్చల్ జిల్లాలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరు కుటుంబ కలహాలతో ఉరివేసుకున్నారు. మరొకరు రైల్వే ట్రాక్ పై పడి సూసైడ్ చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కు చెందిన పందుల కమిటీ కాలనీలో శ్రీను(35) జీవిస్తుండేవాడు. శ్రీను క్యాబ్ డ్రైవర్ గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల కుటుంబ కలహాల కారణంగా శ్రీను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీను దంపతులకు ఇద్దరు సంతానం. ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. శ్రీను ఆత్మహత్య సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీను మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
Read also: Kerala: పీఎఫ్ఐ నుంచి ప్రమాదం..ఆర్ఎస్ఎస్ నేతలకు వై కేటగిరి భద్రత.
షేర్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టాల పాలుకావడంతో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… జీడిమెట్ల టీఎస్ఐఐసీ కాలనీకి చెందిన సురేశ్(38) షేర్ మార్కెట్లో దాదాపు 40లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాడు. ఉన్నట్టుండి నష్టాలు రావడంతో భార్యభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన సురేశ్ భార్యతో గొడవ అనంతరం రాత్రి 12గంటల సమయంలో బైక్ పై బయలుదేరాడు. సురేశ్ భార్య డయల్ 100కి కాల్ చేసి తన భర్త సూసైడ్ చేసుకునేందుక వెళ్లాడని పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సురేశ్ బాలానగర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. కానీ అప్పటికే సనత్ నగర్ రైల్వే ట్రాక్ పై సురేశ్ సూసైడ్ చేసుకున్నాడు. ఆ విషయాన్ని రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సురేశ్ మృత దేహాన్ని గుర్తించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఏది ఏమైనప్పటికీ షేర్ మార్కెట్లో అనుభవం, అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టి నష్టపోయి జీవితాలను పాడుచేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.