Cheetah Cubs Die : కునో పార్కులో మరో రెండు చిరుత పిల్లల మృతి.. అసలేం జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతాకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతున్నది. ఇప్పటికే మూడు చీతాలు, ఓ చిరుత పిల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరో రెండు చిరుత పులి పిల్లలు మృతి చెందాయి. నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుత జ్వాలాకు ఇటీవల నాలుగు పిల్లలు జన్మించాయి. నాలుగు పిల్లలో ఒకటి మంగళవారం తెల్లవారు జామున మరణించింది. గురువారం మరో రెండు పిల్లలు మరణించడం ఆందోళన కలిగిస్తున్నది.
Also Read : Bank Holidays: జూన్‌లో 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు
Also Read
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ వద్ద చిరుతల మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. భారతదేశంలో గురువారం మరో రెండు పిల్ల మరణాలు సంభవించాయి. దీనితో, చిరుత మరణాల సంఖ్య మొత్తం ఆరుకి చేరుకుంది. ఇందులో మూడు పిల్లలు ఉండగా మరో మూడు పెద్ద చిరుతలు. అంతరించిపోతున్న వన్యప్రాణులను గత సంవత్సరం నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తీసుకువచ్చారు. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా అంతరించి పోతున్న చిరత జాతిని రక్షించేందుకు వాటి జనాభాను పునరుద్ధరించడానికి ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది.
Also Read : BIG Breking: ఆలయంలో అపచారం.. దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈతకొట్టిన ఈవో
భారతదేశంలో ఆరు చిరుతలు ఎలా చనిపోయాయి?
కునో నేషనల్ పార్క్‌లో తిరిగి ప్రవేశపెట్టినప్పటి నుంచి భారతదేశంలో మూడు వయోజన చిరుతలు చనిపోయాయి. వీటిలో కిడ్నీ సమస్యల కారణంగా మార్చి 27న మరణించిన ఆడ చిరుత సాష్ కూడా ఉంది. దాని తర్వాత, మగ చిరుత ఉదయ్ ఏప్రిల్ 24న గుండె వైఫల్యం కారణంగా మరణించింది. మే 9న దక్ష అనే మరో ఆడ చిరుత సంభోగం సమయంలో మరొక మగ చిరుతతో గొడవపడి మరణించింది. తాజా మరణాలతో కునోలో గత రెండు నెలల్లో మరణించిన చిరుతల సంఖ్య ఆరుకు చేరుకుంది. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్‌లో ఒక్క పిల్ల మాత్రమే మిగిలి ఉంది.
Also Read : Pawan Kalyan: తగ్గేదేలే.. OG విలన్‌గా స్టార్ హీరో?
మొదటి పిల్ల బలహీనతతో చనిపోయిందని అటవీ శాఖ అధికారి తెలిపారు.అన్ని చిరుత పిల్లలూ బలహీనంగా, తక్కువ బరువుతో ఉన్నట్లు గుర్తించారు. మొదటి సారి డెలివరీ అయిన జ్వాల హుంద్ రియాద్ జాతికి చెందినది. పిల్లలు, దాదాపు ఎనిమిది వారాల వయస్సులో ఉన్నప్పుడు, తమ తల్లి చుట్టూ గుమికూడి ఉండాలని కోరుకుంటాయి. అవి 8-10 రోజుల క్రితం తమ తల్లితో కలిసి నడవడం ప్రారంభించాయని రెండు పిల్లల మరణం తర్వాత కునో నేషనల్ పార్క్ తెలిపింది. కునో నేషనల్ పార్క్ లో మూడు చిరుతల మరణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, మే 18 న సుప్రీంకోర్టు చిరుతలను రాజస్థాన్‌కు తరలించే విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది.
తాజావార్తలు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!