పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి పంజా సినిమా వైబ్స్ ఇస్తుంది ‘OG’ సినిమా. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుజిత్ ‘OG’ సినిమాని స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ‘OG’ సినిమాపైన ఉన్నంత బజ్ పవన్ నటిస్తున్న ఇంకే సినిమా పైన లేదు. ఆ రేంజ్ ప్రమోషన్స్ ని అనౌన్స్మెంట్ నుంచే చేస్తూ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ ని ఇస్తున్నారు మేకర్స్. షూటింగ్ అప్డేట్స్, లొకేషన్ అప్డేట్స్, ఫస్ట్ లుక్… ఇలా ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ని మేకర్స్ రివీల్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ‘OG’ గురించి ఒక సూపర్బ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అయితే అతన్ని ఫేస్ చెయ్యబోయే విలన్ ఏ రేంజులో ఉండాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చూసిన ఒక బెంచ్ మార్క్ క్యారెక్టర్ లా ఉండాలి. అందుకే ఈ క్యారెక్టర్ కోసం సుజిత్ ఒక బాలీవుడ్ హీరోని అప్రోచ్ అవుతున్నాడట. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్ల ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరోలైన టైగర్ ష్రాఫ్, రణవీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా పేర్లు ‘OG’ విలన్ లిస్టులో వినిపిస్తున్నాయి.
ఈ ముగ్గురు హీరోలు బాలీవుడ్ లో సోలో హీరోలుగా మంచి సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు. టైగర్ ష్రాఫ్ చేసే సినిమాలు అసలు ఇండియాలో ఎవరూ చేసే అవకాశమే లేదు. ఇక మిగిలింది ఆయుష్మాన్ ఖురానా, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకున్న ఈ హీరో ఇప్పుడు సోలో హీరోగా సొంత మార్కెట్ క్రియేట్ చేసుకున్న స్థాయికి ఎదిగాడు. ఇలాంటి సమయంలో OG విలన్ క్యారెక్టర్ చేస్తాడా అంటే ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ ఈ ముగ్గురు కాకపోతే వేరే ఏ హీరో OGలో విలన్ గా నటిస్తాడు అనేది చూడాలి. అన్నింటికీ మించి OG నుంచి ఏ అప్డేట్ ఉన్నా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పవన్ ఫాన్స్ కి ఎలాంటి లేట్ చెయ్యకుండా రివీల్ చేసేస్తోంది. సో విలన్ ఎవరు ఫైనల్ అయినా మేకర్స్ నుంచి వెంటనే అప్డేట్ వచ్చేస్తుంది, అప్పటివరకూ రూమర్స్ ఆగుతాయేమో చూడాలి.