NTV Telugu Site icon

Arunachal Pradesh: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు..

Ap

Ap

లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హస్తం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో పాటు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అధికార బీజేపీలో జాయిన్ అయ్యారు.

Read Also: Ration Card E-KYC: ముగుస్తున్న రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ గడువు.. మరో మూడు రోజులే చాన్స్‌

కాగా, అరవై మంది సభ్యులు ఉన్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడు కాంగ్రెస్- ఎన్‌పీపీ రెండింటికీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రులు నినాంగ్ ఎరింగ్ (పాసిఘాట్ పశ్చిమ స్థానం), వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ (బోర్డురియా-బోగపాని నియోజకవర్గం), NPP నుంచి ముచు మిథి (రోయింగ్ అసెంబ్లీ), గోకర్ బాసర్ (బాసర్ అసెంబ్లీ) చేరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పెమాఖండూ పాల్గొన్నారు.

Read Also: R Ashwin: అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసిన ఆర్ అశ్విన్‌!

అయితే, ఈ నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో బీజేపీకి ఇప్పుడు శాసనసభలో 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఈ ఏడాది అరుణాచల్ ప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో కూడిన సుపరిపాలన సూత్రాలపై తనకున్న నమ్మకానికి కాంగ్రెస్, ఎన్పీసీ నుంచి బీజేపీలో చేరారు అని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ సోషల్ మీడియాలో తెలిపారు. సమ్మిళిత వృద్ధి, ప్రజల-కేంద్రీకృత సంక్షేమం సూత్రాలకు మా నిబద్ధతను కొనసాగించడానికి మేము ఎదురుచూస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.