NTV Telugu Site icon

Harrassed : బండిపై వెళ్తున్న యువతిని కొట్టిన యువకులు.. మద్యంమత్తులో వీరంగం..

Harassment

Harassment

హైదరాబాద్ లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్ తానా పరిధిలో బండి మీద వెళ్తున్న యువతిపై కొందరు వ్యక్తులు కర్రతో దాడి చేశారు. ఆ దాడిలో కిందపడిన యువతి జట్టు పట్టి లాగి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని అడ్డగుట్ట సొసైటీలో ఉన్న ఓ ఉమెన్స్ హస్టల్ లో ఉంటూ చదువుకుంటుంది. శనివారం ఆమె మరో ఆరుగురు స్నేహితులు కలిసి బంజారహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న బిర్యానీ వాలాకు వెళ్లేందుకు మూడు బండ్ల మీదు వెళ్లారు.

Also Read : Lord Shiva Sahasranama Stotram: చైత్ర సోమవారం నాడు ఈ స్తోత్రాలు వింటే మనోభీష్టాలు నెరవేరుతాయి..

ఓ బైక్ మీద వెనక యువతి కూర్చింది. బేగంపేట్ వైపు నుంచి బంజారాహిల్స్ రావడానికి జీపీఎస్ పెట్టుకున్నారు. పంజాగుట్ట సర్కిల్ వరకు బాగానే వచ్చారు. ఆ తర్వాత గూగుల్ మ్యాప్ లో రోడ్డు పంజాగుట్ట స్మశాన వాటిక దగ్గర కొత్తగా వేసిన బ్రిడ్జ్ మీద నుంచి చూపించింది. మ్యాప్ ని ఫాలో అవుతూ ఆ దారిలో వాళ్లు వెళ్లారు.. ఇంతలో అదే దారిలో ఇద్దరు యువకులు మరో బైక్ మీద వెళ్తూ ఆమెను అవమానకరంగా కామెంట్స్ చేశారు. వారిద్దరు మద్యం మత్తులో ఉన్నారు. వీళ్లు వారిని దాటుకుని ముందుకు వెళ్లిపోయారు. అయితే.. అది డెడ్ ఎండ్ కావడం.. అటు నుంచి దారి లేకపోవడం మ్యాచ్ రాంగ్ రూడ్ చూపించడంతో అదే దారిలో మళ్లీ వెనక్కి వచ్చారు.

Also Read : Boxing : భారత్ కు మరో రెండు స్వర్ణాలు.. నిఖత్, లవ్లీనా జోరు

ఈ క్రమంలో అంతకుముందు మద్యం తాగి అమ్మాయిని తిట్టిన యువకుల్లో ఒకరు ఆమె మీద కర్రతో దాడి చేశాడు. మరొకడు ఆమె జుట్టుపట్టుకుని లాగాడు. దీంతో అమ్మాయి కింద పడిపోయింది. ఆమె జట్టు పట్టుకొని అలాగే వారిద్దరూ కొంత దూరం లాక్కెళ్లారు. ఇది గమనించిన అమ్మాయితో వచ్చిన మిగతా స్నేహితులు ఆ ఇద్దరినీ పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. అమ్మాయి మీద దాడి చేసిన ఆ యువకులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు పంజాగుట్టకు చెందిన కొండ గోపి, మరో యువకుడు పంజాగుట్ట పోచమ్మ బస్తికి చెందిన పుణ్యసాయి కళ్యాణ్ గా గుర్తించారు.

Also Read : TSRTC: రోడ్డెక్కుతున్న లహరి బస్సులు.. అదిరిపోయే ప్రత్యేకలు ఇవే..

సంబంధం లేని యువతితో సదరు యువకులు గొడవకు దిగడానికి గల కారణం మద్యం మత్తే అని పోలీసులు తేల్చారు. అంతకుముందే వారికి మరో యువతితో గొడవ జరిగినట్లు వెల్లడించారు. కొద్ది సేపటికి అటుగా వెళ్తున్న ఈ యువతిని చూసి.. ఆ యువతి ఈమె అనుకుని దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తమ విచారణలో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు పోలీసులు అన్నారు. స్నేహితులతో పాటు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో యువకులపై కేసు నమోదైంది.