పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు తీరికలేకుండా సినిమాలను చేస్తూనే మరోవైపు కొత్త సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు.. గత ఏడాది బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి వంగ తో ఓ సినిమా చెయ్యబోతున్నాడు. ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నట్లు సందీప్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో సందీప్ బిజీగా ఉన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ నుంచే స్పిరిట్ షూటింగ్ పట్టాలెక్కబోతున్నట్లు చెప్పారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను డైరెక్టర్ దింపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం బాలీవుడ్ టు టాలీవుడ్ మంచి క్రేజ్ అందుకున్న స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ని ఈ సినిమా కోసం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇది నిజమో కాదో చూడాలి. అయితే స్పిరిట్ సినిమాలో మరో హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకుంటున్నట్లుగా టాక్ నడుస్తోంది.. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అప్డేట్ వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..
ప్రస్తుతం స్పిరిట్‌కి 60 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు ఇటీవల సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రూ.300 కోట్లకి పైగా బడ్జెట్‌తో ఈ చిత్రం తీయబోతున్నారు.. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇక ప్రభాస్ నటించిన కల్కి సినిమా త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది..