దేశంలో రోజు రోజుకు అత్యాచార ఘటనలు పెట్రేగిపోతున్నాయి. అమాయక అమ్మాయిలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. కోల్కతా, బద్లాపూర్ ఘటనలు మరువక ముందే ఇలాంటి దారుణ ఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా.. యూపీలో గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది. గోండా జిల్లాలోని ఖోదరే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులను నలుగురు యువకులు బైక్‌లపై కిడ్నాప్ చేసి అడవుల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అయితే.. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో, ఆచూకీ కోసం వెళ్లగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా.. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారు పారిపోయారు. అనంతరం.. ఈ ఘటనపై విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నలుగురు యువకులపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Telegram: పారిస్ లో టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్… భారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం?
బాధిత బాలిక తండ్రి మాట్లాడుతూ.. తన కుమార్తె 8వ తరగతి చదువుతోందని.. శనివారం ఉదయం తన స్నేహితురాలితో కలిసి పాఠశాలకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. కాగా.. నిందితులు అనస్ తన స్నేహితుడు షాదాబ్, మరో ఇద్దరు స్నేహితులు కలిసి రెండు బైక్‌లపై పాఠశాల వద్దకు వచ్చాడని తెలిపాడు. వారంతా కలిసి.. తన కూతురు, స్నేహితురాలిని బలవంతంగా బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. అతనికి సమాచారం తెలియడంతో తన కూతురిని వెతుక్కుంటూ వెళ్లాడు. అయితే.. చంద్రదీప్ ఘాట్ సమీపంలోని అడవిలో తన కూతురు, స్నేహితురాలు కనిపించిందని చెప్పాడు. కాగా.. షాదాబ్, అనాస్ తమ ఇద్దరు స్నేహితులతో కలిసి తమను కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి బెదిరించి సామూహిక అత్యాచారం చేశారని కూతురు, ఆమె స్నేహితురాలు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి షాదాబ్, అనాస్‌లను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read Also: Actress Namitha: మధురై ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం