యువకులు వాహనాలను వేగంగా నడిపి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్నాయి. బైక్‌లు, కార్లలో వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో వెళ్లడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు, వాహనాలు వేగంగా ఉండడంతో వాటిని కంట్రోల్ చేయలేక ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా నార్సింగి పరిధిలో ఓ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో మరో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు బలయ్యారు.
READ MORE: Pakistan: బలూచిస్తాన్‌లో ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలు హైజాక్ చేసిన బీఎల్ఏ..
నార్సింగి మూవీ టవర్ వద్ద ఘటన చోటు చేసుకుంది. ఓ కారు అతివేగంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. అదే కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారులో ప్రయాణిస్తున్న విద్యార్థులంతా సీబీఐటీ కళాశాలకు చెందిన వివేక్ రెడ్డి, హీమ్ సాయి, శ్రీకర్, సృజన్, కార్తికేయ, హర్షవర్ధన్ గా గుర్తించారు. గండిపేట్ కళాశాల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న 6 మంది విద్యార్థులు కారులో ఉన్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
READ MORE: Raviteja: హీరోయిన్స్ ఇద్దరే కానీ వాళ్ళు కాదు.. ట్రోలింగ్ ఎంత పని చేసింది?