తనకన్నా వయసులో చాలా చిన్నవారైన హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడు రవితేజ. అని ఆయన హేటర్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే ట్రోలింగ్ మితిమీరి ఏకంగా ఆయన ఒక సినిమా కోసం ఇద్దరు కుర్ర హీరోయిన్స్ ను ఫైనల్ చేశాడు అనే ప్రచారం మొదలైపోయింది. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా ఓకే అయింది. దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందాల్సి ఉంది. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం ఉంది.
Gaddar Cine Awards: గద్దర్ సినీ అవార్డులకు ఎంట్రీల ఆహ్వానం
అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతున్న కాయాదు లోహార్ తో పాటు మమితా బైజును కూడా ఈ సినిమాలోకి తీసుకున్నట్టు ప్రచారం మొదలు పెట్టారు ఆయన హేటర్స్, వారి ఉద్దేశ్యం ఏమిటంటే సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న హీరోయిన్స్ ని రవితేజ వదిలి పెట్టడు అని జనాల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది నిజం కాదని తెలుస్తుంది. నిజానికి కిషోర్ తిరుమల సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం. కానీ ఆ హీరోయిన్స్ ఎవరు అనే విషయాన్ని ఇప్పటివరకు ఫైనల్ చేయలేదు. కాబట్టి ఆ హీరోయిన్స్ ఎవరు అనే విషయం గురించి ఇప్పటి నుంచే మాట్లాడడం కరెక్ట్ కాదని అంటున్నారు.