NTV Telugu Site icon

Ayodhya: అయోధ్యలో సరికొత్త దోపిడీ.. షాకైన భక్తులు.. చివరికి ఏమైందంటే..!

Ayodhya

Ayodhya

Ayodhya: గత వారం ఎంతో ఘనంగా అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. దేశ నలుమూలల నుంచి వచ్చేసిన అతిరథమహారధుల మధ్య అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇప్పుడు లక్షలాది మంది ప్రతిరోజు అయోధ్యను సందర్శిస్తున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో రకరకాల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పడ్డాయి. అలాగే అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కూడా మరికొన్ని ఏర్పడ్డాయి. అయితే ఓ రెస్టారెంట్ నిర్వాహకుడి చేసిన కక్కుర్తిపని వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల తాకిడిని ఆసరాగా చేసుకుని ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్న రెస్టారెంట్ భరతం పట్టారు నెటిజన్లు.

Read Also: Chandrababu: ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరిరోజు..

శబరి రసోయి అనే పేరుతో అయోధ్యలో ఓ రెస్టారెంట్ కొత్తగా ప్రారంభమైంది. ఇక్కడ తక్కువ ధరలనే భక్తులకు సేవలందించాలి. కానీ ఇదే మంచి సమయం అనుకున్నారో.. ఏంటో తెలియదు గానీ ఏకంగా పది రూపాయలకు అందించాల్సిన పదార్థాలను వందల్లో వసూలు చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. రెండు కప్పుల టీ, రెండు బ్రెడ్‌ ముక్కల కోసం ఏకంగా రూ. 252 వసూలు చేసింది. సంబంధిత బిల్లును కస్టమర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ పోస్ట్ కాస్తా కొద్దిసేపటికే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయిపోయింది. ఇంత అన్యాయం అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చివరికి ఈ అంశం అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ (ఏడీఏ)కి చేరింది. దీంతో సదరు హోటల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని రెస్టారెంట్‌ను ఆదేశించింది. లేని పక్షంలో ఒప్పందాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది.

Read Also: Freedom Fighter Marriage: 49 ఏళ్ల మహిళతో 103 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడి వివాహం