NTV Telugu Site icon

Twitter Blue: భారత్‌లోనూ బ్లూటిక్ వెరిఫికేషన్.. నెలవారీ రుసుం ఎంతంటే?

Twitter Blue

Twitter Blue

Twitter Blue: ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కింద అమెరికా సహా ఎంపిక చేసిన పలు దేశాల్లో నెలవారీ రుసుంతో బ్లూటిక్‌ ఇస్తున్న ట్విట్టర్‌ భారత్‌లోనూ ప్రారంభించింది. ట్విట్టర్ వెబ్‌సైట్‌ని ఉపయోగిస్తున్న వారు బ్లూటిక్ కావాలంటే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ట్విట్టర్ బ్లూ ఐవోఎస్‌, ఆండ్రాయిడ్ పరికరాల్లో అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలోని ఐవోఎస్‌, ఆండ్రాయిడ్ వినియోగదారులకు నెలవారీ సభ్యత్వ రుసుము రూ. 900 కాగా, వెబ్ కోసం రుసుము నెలకు రూ.650 రుసుమును నిర్ధారించింది. అంటే ఈ మొత్తం చెల్లిస్తే నెల రోజుల పాటు ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ వెరిఫికేషన్ వర్తిస్తుంది. ఇంతకు ముందు ఈ బ్లూ టిక్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. ట్విట్టర్ నియమాల ప్రకారం.. ఎంపిక చేసిన అభ్యర్థులకు మాత్రమే దీనిని జారీ చేసేవారు. ఇప్పుడు చెక్‌మార్క్‌ను చందా రుసుము చెల్లించే ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.

బ్లూ టిక్‌తో పాటు, ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు ఎడిట్ ట్వీట్, బుక్‌మార్క్ ఫోల్డర్‌లు, కస్టమ్ యాప్ చిహ్నాలు, ఎన్‌ఎఫ్‌టీ ప్రొఫైల్ పిక్చర్‌ల వంటి ఫీచర్‌లకు ముందస్తు యాక్సెస్‌ను పొందుతారు. అలాంటి వినియోగదారులు తమ యాప్‌కు వేర్వేరు రంగుల థీమ్‌లను ఎంచుకోగలుగుతారు. ట్వీట్‌లపై వారి ప్రత్యుత్తరానికి ప్రాధాన్యత ఇవ్వగలరు. ఇతర వినియోగదారులకు కనిపించే ముందు ట్వీట్‌ను రద్దు చేయగలరు. వీటితో పాటు ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు 4,000 ఎక్కువ అక్షర పరిమితిని పొందుతారు. అయితే ఇతర వినియోగదారులకు అక్షర పరిమితి 280 అక్షరాలే. చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ వినియోగదారులను 60 నిమిషాల వరకు లేదా 2 జీబీ వరకు పరిమాణాన్ని కలిగి ఉన్న పొడవైన వీడియోలను అప్‌లోడ్ చేయడానికి అనుమతిస్తుంది.

Maharashtra ATS: 2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్‌ స్టేట్‌గా మార్చాలనుకుంటోంది..

ట్విట్టర్ ఇప్పుడు అనేక దేశాలలో దాని ప్రీమియం సేవను ప్రారంభించింది. వీటిలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్‌లు ఉన్నాయి. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రకారం, కొత్త వినియోగదారులు 90 రోజుల పాటు ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని పొందలేరు. ఎటువంటి నోటీసు లేకుండా వేచి ఉండే వ్యవధిని విధించవచ్చు. వినియోగదారులు వార్షిక ప్లాన్‌ను కనుక పొందినట్లయితే బ్లూ టిక్ సభ్యత్వం సంవత్సరానికి 6,800 రూపాయలు చెల్లించాలి. ఇలా చూసుకుంటే నెలకు 566.67 రూపాయల చొప్పున సభ్యత్వం లభిస్తుంది. ట్విట్టర్ బ్లూతో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రొఫైల్‌లో బ్లూ బ్యాడ్జ్ పబ్లిక్ ప్రొఫైల్ గుర్తింపును ఇస్తుంది. దీనితో పాటు తక్కువ ప్రకటనలు, ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు, రాబోయే ఫీచర్‌లకు ముందస్తుగా యాక్సెస్‌ని పొందవచ్చు. స్పాం వంటి వాటి నుంచి రక్షణను ఇస్తుంది.

Show comments