Twitter Blue: భారత్‌లోనూ బ్లూటిక్ వెరిఫికేషన్.. నెలవారీ రుసుం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twitter Blue: ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కింద అమెరికా సహా ఎంపిక చేసిన పలు దేశాల్లో నెలవారీ రుసుంతో బ్లూటిక్ ఇస్తున్న ట్విట్టర్ భారత్‌లోనూ ప్రారంభించింది. ట్విట్టర్ వెబ్‌సైట్‌ని ఉపయోగిస్తున్న వారు బ్లూటిక్ కావాలంటే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ట్విట్టర్ బ్లూ ఐవోఎస్, ఆండ్రాయిడ్ పరికరాల్లో అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలోని ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు నెలవారీ సభ్యత్వ రుసుము రూ. 900 కాగా, వెబ్ కోసం రుసుము నెలకు రూ.650 రుసుమును నిర్ధారించింది. అంటే ఈ మొత్తం చెల్లిస్తే నెల రోజుల పాటు ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ వెరిఫికేషన్ వర్తిస్తుంది. ఇంతకు ముందు ఈ బ్లూ టిక్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. ట్విట్టర్ నియమాల ప్రకారం.. ఎంపిక చేసిన అభ్యర్థులకు మాత్రమే దీనిని జారీ చేసేవారు. ఇప్పుడు చెక్‌మార్క్‌ను చందా రుసుము చెల్లించే ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.
బ్లూ టిక్‌తో పాటు, ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు ఎడిట్ ట్వీట్, బుక్‌మార్క్ ఫోల్డర్‌లు, కస్టమ్ యాప్ చిహ్నాలు, ఎన్‌ఎఫ్‌టీ ప్రొఫైల్ పిక్చర్‌ల వంటి ఫీచర్‌లకు ముందస్తు యాక్సెస్‌ను పొందుతారు. అలాంటి వినియోగదారులు తమ యాప్‌కు వేర్వేరు రంగుల థీమ్‌లను ఎంచుకోగలుగుతారు. ట్వీట్‌లపై వారి ప్రత్యుత్తరానికి ప్రాధాన్యత ఇవ్వగలరు. ఇతర వినియోగదారులకు కనిపించే ముందు ట్వీట్‌ను రద్దు చేయగలరు. వీటితో పాటు ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు 4,000 ఎక్కువ అక్షర పరిమితిని పొందుతారు. అయితే ఇతర వినియోగదారులకు అక్షర పరిమితి 280 అక్షరాలే. చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ వినియోగదారులను 60 నిమిషాల వరకు లేదా 2 జీబీ వరకు పరిమాణాన్ని కలిగి ఉన్న పొడవైన వీడియోలను అప్‌లోడ్ చేయడానికి అనుమతిస్తుంది.
Also Read
Maharashtra ATS: 2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలనుకుంటోంది..
ట్విట్టర్ ఇప్పుడు అనేక దేశాలలో దాని ప్రీమియం సేవను ప్రారంభించింది. వీటిలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్‌లు ఉన్నాయి. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రకారం, కొత్త వినియోగదారులు 90 రోజుల పాటు ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని పొందలేరు. ఎటువంటి నోటీసు లేకుండా వేచి ఉండే వ్యవధిని విధించవచ్చు. వినియోగదారులు వార్షిక ప్లాన్‌ను కనుక పొందినట్లయితే బ్లూ టిక్ సభ్యత్వం సంవత్సరానికి 6,800 రూపాయలు చెల్లించాలి. ఇలా చూసుకుంటే నెలకు 566.67 రూపాయల చొప్పున సభ్యత్వం లభిస్తుంది. ట్విట్టర్ బ్లూతో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రొఫైల్‌లో బ్లూ బ్యాడ్జ్ పబ్లిక్ ప్రొఫైల్ గుర్తింపును ఇస్తుంది. దీనితో పాటు తక్కువ ప్రకటనలు, ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు, రాబోయే ఫీచర్‌లకు ముందస్తుగా యాక్సెస్‌ని పొందవచ్చు. స్పాం వంటి వాటి నుంచి రక్షణను ఇస్తుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!