Vaishali Kidnap Case : మరో ట్విస్ట్.. ఇంట్లో ఉన్నోళ్లను పోలీసులు తీసుకెళ్లారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి నడిబొడ్డున ఓ యువతిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి పోలీసులకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే.. సుమారు 100 మందితో పట్టపగలు యువకులతో వెళ్లి ఇంట్లో వైశాలి అనే యువతిని మిస్టర్ టీ షాప్ ఓనర్ నవీన్ రెడ్డి కిడ్నాప్ చేయడంతో ఈసంఘటన సంచలనంగా మారింది. అయితే.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. కొన్ని గంటల్లోనే కిడ్నాపర్ల ఆట కట్టించి.. ప్రధాన సూత్రధారైన నవీన్ రెడ్డి అరెస్ట్ చేశారు. అంతేకాకుండా.. నవీన్ రెడ్డితో పాటు ఇప్పటికీ 31 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కేసులో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైశాలికి తనకు పెళ్లైందని నవీన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే.. తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆదిభట్ల పీఎస్ నుండి 32 మందిని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అరెస్టు చేసిన వారిలో కొంతమంది కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు. తమ వారిని అనవసరంగా అరెస్టు చేశారంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తమ పిల్లల్ని కనీసం మాట్లాడించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Weather Update: అల్పపీడనంగా బలహీనపడిన మాండూస్ తుఫాన్
అరెస్ట్ అయిన వారిలో దాడికి సంబంధం లేనివారిని అరెస్ట్ చేసారని పీఎస్ ముందు బంధువుల ఆందోళన చేపట్టారు. అరెస్ట్ అయిన వారిలో ఓ పాన్ షాప్ యువకుడు ఉన్నాడు. అయితే.. మిస్టర్ టీ స్టాల్ పక్కనే పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు సదరు యువకుడు. నిన్న దాడి జరిగిన సమయంలో మా తమ్ముడు ఇంట్లో ఉన్నాడని.. సాయంత్రం షాప్ తెరిచాడని, పోలీసులు వచ్చి తీసుకుని వెళ్లారన్నారు. అసలు నిందితులను వదిలేసి అమాయకులను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని, అసలు దోషులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అమాయకులను వదిలేయాలని, సిసిటీవీ కెమెరాలను చూసి అసలు దోషులను గుర్తించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితులందరికీ వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు.. 32 మందిని ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరు పరిచారు.
Also Read
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
తాజావార్తలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
-
Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
-
IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!