NTV Telugu Site icon

Vaishali Kidnap Case : మరో ట్విస్ట్‌.. ఇంట్లో ఉన్నోళ్లను పోలీసులు తీసుకెళ్లారు..!

Kidnaped

Kidnaped

రంగారెడ్డి నడిబొడ్డున ఓ యువతిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి పోలీసులకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే.. సుమారు 100 మందితో పట్టపగలు యువకులతో వెళ్లి ఇంట్లో వైశాలి అనే యువతిని మిస్టర్‌ టీ షాప్‌ ఓనర్‌ నవీన్‌ రెడ్డి కిడ్నాప్ చేయడంతో ఈసంఘటన సంచలనంగా మారింది. అయితే.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. కొన్ని గంటల్లోనే కిడ్నాపర్ల ఆట కట్టించి.. ప్రధాన సూత్రధారైన నవీన్‌ రెడ్డి అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా.. నవీన్‌ రెడ్డితో పాటు ఇప్పటికీ 31 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే.. ఈ కేసులో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైశాలికి తనకు పెళ్లైందని నవీన్‌ రెడ్డి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అయితే.. తాజాగా మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆదిభట్ల పీఎస్ నుండి 32 మందిని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అరెస్టు చేసిన వారిలో కొంతమంది కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు. తమ వారిని అనవసరంగా అరెస్టు చేశారంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తమ పిల్లల్ని కనీసం మాట్లాడించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Weather Update: అల్పపీడనంగా బలహీనపడిన మాండూస్ తుఫాన్

అరెస్ట్ అయిన వారిలో దాడికి సంబంధం లేనివారిని అరెస్ట్ చేసారని పీఎస్ ముందు బంధువుల ఆందోళన చేపట్టారు. అరెస్ట్ అయిన వారిలో ఓ పాన్ షాప్ యువకుడు ఉన్నాడు. అయితే.. మిస్టర్ టీ స్టాల్ పక్కనే పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు సదరు యువకుడు. నిన్న దాడి జరిగిన సమయంలో మా తమ్ముడు ఇంట్లో ఉన్నాడని.. సాయంత్రం షాప్ తెరిచాడని, పోలీసులు వచ్చి తీసుకుని వెళ్లారన్నారు. అసలు నిందితులను వదిలేసి అమాయకులను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని, అసలు దోషులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అమాయకులను వదిలేయాలని, సిసిటీవీ కెమెరాలను చూసి అసలు దోషులను గుర్తించాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితులందరికీ వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు.. 32 మందిని ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరు పరిచారు.