Dadisetti Raja: సంక్షేమం, అభివృద్ధి అంటే ఏంటో జగన్ చూపించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dadisetti Raja: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ తుని అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక సెగ్మెంట్‌లో మరోసారి విజయకేతనం ఎగరవేయాలని అధికార వైసీపీ ఆశిస్తోంది. గెలుపు కోసం ఆ పార్టీ అభ్యర్థి, మంత్రి దాడిశెట్టి రాజా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు మంత్రి దాడిశెట్టి రాజా. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తుని వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గత ఐదేళ్లలో సంక్షేమం, అభివృద్ధి అంటే ఏంటో జగన్ చూపించారని, మరొక అవకాశం ఇవ్వాలని కోరారు.
మరోవైపు తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీ కొత్త సూరవరంలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో తుని వైసీపీ అభ్యర్థి రాజా కుమారుడు దాడిశెట్టి శంకర్ మల్లిక్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసారు. తన తండ్రి దాడిశెట్టి రాజాకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అవ్వతాతలకు జగనన్న సీఎం అయితేనే పెన్షన్లు ఇంటికి పంపిస్తారని వివరించారు. రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్న జగనన్నకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. మళ్లీ దాడిశెట్టి రాజాను గెలిపిస్తే తుని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు.
Also Read
- Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
తాజావార్తలు
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
-
Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
-
Samsung Galaxy Z Fold 8: 50MP కెమెరా, 4800mAh బ్యాటరీతో.. సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 విడుదల
-
Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!