Tummala Nageswara Rao : పంట నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటాం
- సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతన్న నేతన్నలకే ప్రాధాన్యతలు
- యువత మంచి భవిషత్ కలించాలి
- 33 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశాం : మంత్రి తుమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageswara Rao : రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతన్న, నేతన్నలే అగ్ర ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం సంకల్పంతో పని చేస్తోందని, రైతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం తాకినప్పటికీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే 33 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీని అమలు చేసినట్లు తెలిపారు. రైతుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ ప్రభుత్వమే చేపట్టనుందని వెల్లడించారు. రైతులు అనుమతి లేని కంపెనీల విత్తనాలు, లూజ్ విత్తనాలు తీసుకోకుండా, ప్రభుత్వం అందించే నాణ్యమైన విత్తనాలే వాడాలని సూచించారు. కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
చేనేత రంగం గుండె చప్పుడు ఆగకూడదని, నేతన్నల కన్నీరు తుడిచేలా ప్రభుత్వం అన్ని శాఖలకూ టెస్కో ద్వారా కొనుగోళ్లను తప్పనిసరి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలను చేనేత కార్మికుల వద్ద నుంచే కొనుగోలు చేస్తామని, ఈ విధంగా నేతన్నల ఆర్థిక స్థితిని మెరుగుపరచే ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని కొనసాగించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
ఇక ఉపాధి అవకాశాల విషయానికి వస్తే, జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు తిరిగి తమ సొంత రాష్ట్రమైన తెలంగాణకు రావాలన్న ఉద్దేశంతో ఉద్యోగావకాశాలను మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. రానున్న నాలుగేళ్లలో తెలంగాణను దేశంలో ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చుపెట్టే సొమ్ముతో కేంద్ర పథకాలు నడుస్తున్నాయన్నారు. అయినా కేంద్రమంతటా తమ ఫోటోలు పెట్టించుకుంటున్నారని, ప్రజల సొమ్ముతో ప్రజలకే మేలు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ పథకాలు ఎవరి వ్యక్తిగత సంపత్తి కాదని, ఇవి ప్రజల హక్కు అన్నారు.
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయదని స్పష్టం చేశారు. ఇప్పటికే పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఒక్కొక్క రైతు గుండెల్లో భరోసా నింపేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్‌ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!